చట్టపరంగా న్యూ ఇయర్ను ఎంజాయ్ చేయండి.. హద్దు మీరితే సెంట్రల్ జైలే గతి.. సీపీ మాస్ వార్నింగ్.. న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.. 2025కి బైబై చెప్పేసి.. 2026కి గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.. అయితే, చట్టపరంగా న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయండి, హద్దు మీరితే విశాఖ సెంట్రల్ జైలే గతి అని మాస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. న్యూ ఇయర్ ముసుగులో మత్తు సరఫరా…
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, సంక్షేమ పథకాలు మరియు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్…
అందుకే మనకు ప్రధానితో సహా జాతీయ స్థాయిలో గౌరవం..! 21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు ఉన్న పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీతో సహా జాతీయ స్థాయిలో మనకి గౌరవం ఇస్తున్నారంటే.. జనసేన అంత బలమైనది అని అర్థం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు.. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని…
విశాఖ గురించి వైఎస్ జగన్ చెప్పిందే.. చంద్రబాబు చెబుతున్నారు.. అన్నివైపులా విశాఖ అభివృద్ధిపై చర్చ సాగుతున్న వేళ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ అప్పుడు విశాఖ గురించి చెప్పిన విషయాలనే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని తొలి సారిగా వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విశాఖ ప్రాధాన్యతను ఎందుకు గుర్తించలేదని…
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..! ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రూ.169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఇది రాష్ట్ర…
మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని.. కేఏ పాల్ వార్నింగ్.. మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. ఏపీ హైకోర్టుకు వెళ్తున్న తన వెహికల్ ఆపడంపై మండిపడ్డ ఆయన.. కరకట్ట రోడ్డుపై తన వెహికల్ ఆపడం ఏంటి? అని ప్రశ్నించారు.. ఏపీ హైకోర్టు కోర్టు 17లో నా మేటర్ ఉంది.. 20 నిముషాలు సమయం కోరాను..…
2026లో ప్రభుత్వ సెలవుల ఇవే.. ఉత్తర్వులు జారీ.. డిసెంబర్ నెలలోకి వచ్చేశాం.. త్వరలోనే 2025 ఏడాదికి బైబై చెప్పి.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, వచ్చే ఏడాది ఎప్పుడు సెలవులు ఉన్నాయి.. ఆ సెలవుల్లో ఏం ప్లాన్ చేసుకోవాలని ఎదురు చూసేవాళ్లు సైతం ఉన్నారు.. పబ్లిక్ హాలీడేస్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూ్ళ్లకు కూడా సెలవులు ఉండడంతో.. వాటికి అనుగుణంగా ఇప్పుడే.. ప్రణాళికలు చేసుకునేవారు కూడా ఉన్నారు.. ఇక, ఈ నేపథ్యంలో…
వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.. డీఎంహెచ్వో వివరణ స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. పల్నాడు జిల్లా డీఎంహెచ్వో రవికుమార్ స్క్రబ్ టైఫస్ కేసులపై వివరణ ఇచ్చారు.. జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే, ఈ వ్యాధి గురించి ప్రజలు అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎంహెచ్వో రవికుమార్ వివరాల ప్రకారం, స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదు.. ఇది ఒక రకమైన చిన్న…
హలో ఇండియా.. ఆంధ్రాలో అరటి రైతుల దుస్థితి చూడండి..! ఆంధ్రప్రదేశ్లో అరటి రైతుల దుస్థితిపై సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో అరటి రైతుల పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్లో కీలక ట్వీట్ చేశారు. “హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఏ స్థితిలో ఉందో చూడండి” అంటూ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక కిలో అరటిపండ్లు కేవలం 50…
తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..! తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ…