నేడు నిడుదవోలుకు సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నిత్యం బిజీగా గడిపేస్తున్నారు.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలులో పర్యటించనున్నారు.. నిడుదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు ముఖ్యమంత్రి జగన్.. నిడుదవోలు పర్యటన కోసం ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం.. ఉదయం 10.40 గంటలకు నిడుదవోలు చేరుకోనున్న ఆయన.. గాంధీనగర్‌లో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్‌లో జరగనున్న నిడుదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుఅవుతారు.. వధూవరులను ఆశీర్వదిస్తారు.. ఆ తర్వాత ఉదయం 11.45 గంటలకు నిడుదవోలు నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 12.25 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, సీఎం పర్యటన దృష్ట్యా.. ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు నిడుదవోలు పోలీసులు..
జీవితం విలువ తెలిసింది.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా
గతేడాది డిసెంబర్ 30వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఈ ప్రమాదం తర్వాత తనకు జీవితం విలువ తెలిసిందని, చేసే ప్రతీ చిన్న పనిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటున్నానని చెప్పాడు. జీవితాన్ని భిన్నమైన కోణంలో చూస్తున్నానని తెలిపాడు. బ్రష్ చేయడం, ఉదయాన్నే ఎండకు కూర్చోవడం వంటి పనులు.. తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయన్నాడు. గాయాల నుంచి త్వరగా కోలుకుంటున్నానని, రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తానని, అయితే కచ్ఛితమైన సమయాన్ని చెప్పలేనన్నాడు. భగవంతుడి దయ, డాక్టర్ల సహకారంతో.. త్వరలోనే మామూలు మనిషిని అవుతానని చెప్పాడు. రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రమాదం తర్వాత జీవితం విషయంలో నా దృష్టికోణం మారింది. సాధారణంగా మనం పట్టించుకోని దైనందిన కార్యకలాపాలను సైతం ఆస్వాదిస్తున్నాను. ఈరోజుల్లో.. ఏదో సాధించాలన్న తపనతో, మనకు సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాల్ని విస్మరిస్తున్నాం. ఈ యాక్సిడెంట్ తర్వాత నేను వాటిని ఆస్వాదించగలుగుతున్నా’’ అని చెప్పుకొచ్చాడు. తాను ప్రతిరోజూ ఫిజియోథెరపి సెషన్‌లో పాల్గొంటున్నానని.. ఆ తర్వాత సెకండ్ సెషన్‌కు సిద్దమవుతున్నానని చెప్పాడు. సాయంత్రం చివరి సెషన్‌తో రోజును ముగిస్తున్నాని తెలిపాడు. సమయానికి పండ్లు, పానీయాలు తీసుకుంటున్నానని.. తాను పూర్తిగా కోలుకునేదాకా ఈ విధానం కొనసాగుతుందని పేర్కొన్నాడు. తాను వేగంగా కోలుకోవాలని ఎంతోమంది మెసేజ్‌లు చేశారని, వారందరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. ఇంతమంది శ్రేయోభిలాషులు, అభిమానులు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. క్రికెట్‌కు దూరమైనందుకు వెలితిగా ఉందని, తిరిగి క్రికెట్ ఆడాలని తహతహలాడుతున్నానని రిషభ్ పంత్ వెల్లడించాడు.
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర.. వాణిజ్య సిలిండర్ ధరపై రూ.350.50 వడ్డింపు..
మరోసారి వంటగ్యాస్ ధరలను వడ్డించేశారు.. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 పెంచేశారు.. ఇక వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.350.50 పెరిగింది.. దేశవ్యాప్తంగా నేటి నుంచి పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి.. 14.2 కిలోల డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధర రూ.50 పెరగడంతో.. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,103కి చేరింది.. ఇక, హైదరాబాద్‌లో 14.2 కిలోల ఎల్‌పీజీ ధర రూ.1,155కి పెరిగింది.. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులను బట్టి ఈ రేట్లు మారుతూ ఉంటాయి. మరోవైపు.. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.350.50 పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2119.50కు చేరింది.. చమురు సంస్థలు వడ్డించిన ఈ కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.. ఇక, దేశీయ వంట గ్యాస్ ధరలు స్థానిక పన్నుల కారణంగా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ఇంధన రిటైలర్లు ప్రతి నెల ప్రారంభంలో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తూ వస్తున్నారు.. ప్రతి కుటుంబానికి ఏడాదికి 14.2 కిలోల 12 సిలిండర్లు సబ్సిడీ ధరలకు అందజేస్తున్నారు.. అంతకు మించి వినియోగిస్తే.. సదరు వినియోగదారులు మార్కెట్ ధరలో ఎల్‌పిజి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. PAHAL (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ LPG) పథకం కింద, వినియోగదారులు సబ్సిడీ రేటుతో ఎల్‌పీజీ సిలిండర్‌లను పొందుతారు. సబ్సిడీ విదేశీ మారకపు రేట్లు, ముడి చమురు ధరలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి..
ఆకాశాన్నంటిన టమోటా ధర.. పిజ్జాపై భారీ ఎఫెక్ట్
టమోటా.. దీనిని దాదాపు ప్రతీ వంటకంలోనూ వాడుతారు. ఈ టమోటా వేసిన వంటకాల రుచి వేరుగా, టేస్టీగా ఉంటుంది. ఇక పిజ్జా అయితే.. టమోటా లేనిదే రుచికరంగా ఉండదు. కానీ, బ్రిటన్ ప్రజలు ఇప్పుడు టమోటా లేకుండానే పిజ్జా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. అక్కడ టమోటా ధరలకు రెక్కలొచ్చేశాయి. గతేడాది కేవలం 5 పౌండ్లు ఉన్న కిలో టమోటా ధర.. ఇప్పుడు 20 పౌండ్లకు (ఇండియన్ కరెన్సీలో రూ.1986)కి చేరింది. కొన్ని చోట్ల 30 పౌండ్ల (రూ.2979)కు అమ్ముతున్నారు. ఇలా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, సూపర్ మార్కెట్లలో టమోటా కొరత ఏర్పడింది. ముఖ్యంగా.. పిజ్జా మార్కెట్‌పై భారీ ఎఫెక్ట్ పడింది. పిజ్జా, పాస్తా, సాస్ తయారీలో టమోటాను వినియోగిస్తారన్న విషయం తెలిసిందే! ఇప్పుడు టమోటా ధరలు గణనీయంగా పెరగడంతో.. వ్యాపారులు పిజ్జా ధరల్ని అమాంతం పెంచేశారు. కొందరు.. టమోటా-ఫ్రీ (టమోటా లేని) పిజ్జాలను విక్రయిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లైతే తాత్కాలికంగా మూతపడ్డాయి కూడా! ఒక్క బ్రిటన్‌లోనే కాదు.. ఇటలీలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ టమోటా ధరలు పెరగడంపై ఇటాలియన్ చెఫ్స్ అసోసియేషన్ FIC అధ్యక్షుడు ఎంజో ఒలివేరి మాట్లాడుతూ.. ప్రతీ చోటా టమోటాల షార్టేజ్ ఉందని, ఎక్కడి నుంచి టమోటాలు సరఫరా అవ్వడం లేదని అన్నారు. కొన్ని రెస్టారెంట్లైతే టమోటా-లెస్ పిజ్జాలను అందిస్తుండటంతో పాటు కొన్ని వంటకాల్ని పూర్తిగా ‘మెను’ నుంచి తీసేశాయని తెలిపారు. టమోటా ధరలు భారీగా పెరగడం వల్ల.. వైట్ పిజ్జాల, వైట్ సాస్, టమోటా-లెస్ పిజ్జాల ట్రెండ్‌ని మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు.
యూఎన్ ప్యానెల్ చర్చల్లో నిత్యానంద ‘కైలాస’ ప్రతినిధి.. భారత్ ఇబ్బంది పెడుతుంది..!
లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసుల్లో చిక్కుకున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద.. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయారు.. ఏకంగా ఓ దేశాన్నే స్థాపించేశారు.. దానికి ‘కైలాస’ దేశంగా నామకరణం చేశారు.. ఇక ప్రత్యేక కరెన్సీ.. తమ దేశంలో అడుగుపెట్టాలంటే.. వీసా ఉండాల్సిందే.. లాంటి నిబంధలు పెట్టారని కూడా వార్తలు వినిపించాయి.. అయితే, ఇప్పుడు నిత్యానంద స్థాపించిన ‘కైలాస’ దేశం ప్రతినిధి.. ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాన్గొనడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ.. గత నెల అంటే ఫిబ్రవరి 24వ తేదీన చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది.. ఈ చర్చలో తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధిని అంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ పాల్గొన్నారు. అంతే కాదు.. తన అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.. హిందూ మతాన్ని, ఆచార సంప్రదాయాలను నిత్యానంద ప్రచారం చేస్తున్నారని వెల్లడించిన ఆమె.. అయితే, నిత్యానందను భారతదేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు గుప్పించారు.. ఆయనకు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. నిత్యానంద కల్పిత దేశం ‘కైలాస’ నుంచి యూఎన్ ప్యానెల్ చర్చలోకి ప్రవేశించింది ఓ మహిళ.. తలపాగా, నుదుటిపైన ఆభరణం మరియు నెక్లెస్‌లు ధరించి భారీ మేకప్‌తో ఉన్న ఆ మహిళ, యూఎన్‌లో యూఎస్‌కే ప్రతినిధి విజయప్రియ నిత్యానందగా పిలవబడింది.. పరారీలో ఉన్న స్వయం ప్రకటిత దైవం స్వామి నిత్యానంద కల్పిత దేశం ‘కైలాస’ ప్రతినిధులు జెనీవాలో స్థిరమైన అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి కమిటీ చర్చలోకి ప్రవేశించడం ద్వారా ప్రపంచ సంస్థ దానిని గుర్తించిందనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (USK) నుండి ప్రజల కోసం తెరవబడిన సెషన్‌లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు. యూఎన్‌చే గుర్తింపు పొందిన 193 దేశాలలో యూఎస్‌కే లేదు, భద్రతా మండలి మరియు జనరల్ అసెంబ్లీ రెండింటి ఆమోదం అవసరమయ్యే ప్రవేశానికి కఠినమైన నియమాలు ఉన్నాయి.
దీన్ని మించిన ట్రైలర్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని రిటర్న్ తెస్తాం అని రాజమౌళి ఏ రోజు మాట ఇచ్చాడో తెలియదు కానీ ఆ మాట ప్రతి స్టేజ్ లో నిజం చేస్తూనే ఉన్నాడు. ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరుకుంటుంది దాన్ని మించిన విజయం మరొకటి లేదు. ఇండియాలో 1200 కోట్లు, జపాన్ లో 100 డేస్ గా హౌజ్ ఫుల్ షోస్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ సర్కిల్, HCA ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి సినీ అవార్డ్స్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ సినిమా జెండా ఎగారేస్తునే ఉంది. మార్చ్ 12న జరగబోయే ఆస్కార్ వేదికపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ తీసుకోని వస్తే అది భారతీయ సినీ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఇండియన్ సినిమా గ్రాఫ్ నే మార్చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఏడాది కాలంగా మెస్మరైజ్ చేస్తూనే ఉంది. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి లాంటి లెజెండ్స్ ది బెస్ట్ కాంట్రిబ్యుషన్ ఇవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక ఎపిక్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రిలీజ్ అయ్యి ఏడాది గడుస్తున్నా ఆర్ ఆర్ ఆర్ సినిమా మ్యాజిక్ వేవ్ ఫిదా చేస్తూనే ఉంది. ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ మార్చ్ 12న ఉన్న సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాని మరో సారి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మార్చ్ 3న ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అనేక వెస్ట్రన్ కంట్రీస్ లో స్పెషల్ షోకి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. టికెట్స్ కూడా సొల్ద్ అవుట్ అవుతున్నాయి, ఇండియాలో కూడా మార్చ్ 3న ఆర్ ఆర్ ఆర్ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ రీరిలీజ్ కోసం మేకర్స్ స్పెషల్ ట్రైలర్ ని కట్ చేశారు. స్టీఫెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కమరూన్ లాంటి దిగ్గజ దర్శకులు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి చెప్పిన మాటలని కోట్ చేస్తూ, ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించిన ఘనతలని గుర్తు చేస్తూ కట్ చేసిన ట్రైలర్, ఒరిజినల్ ట్రైలర్ ని మించి ఉంది. ఫస్ట్ పేస్ లో కట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ రీరిలీజ్ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. మరి మార్చ్ 3న ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే నాటు నాటు సింగర్స్ కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లు మార్చ్ 12న ఆస్కార్ అవార్డ్స్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఆ ప్రెస్టీజియస్ స్టేజ్ పైన లైవ్ పెర్ఫార్మెన్స్ తో పాటు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కూడా నాటు నాటు హుక్ స్టెప్ చేస్తే… సినిమా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా హై ఆన్ ఎనర్జీతో ఊగిపోవడం ఖయాం.