ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కొత్త కార్యక్రమం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్,…
ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేడు అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం అంశాలపై ఈ భేటీల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రధానంగా “పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్”కు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధానం అంశాలపై కేంద్ర…
నేడు గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ.. తమ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమబాట పట్టింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అనేక రూపాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే జనం నుంచి కోటికిపైగా సంతకాల సేకరించింది వైసీపీ. వీటిని గవర్నర్‌కి సమర్పించి పీపీపీ మోడల్‌ను అడ్డుకోవాలని కోరబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గవర్నర్‌కు కోటి…
ఏపీలో నేడు వైసీపీ ర్యాలీలు.. కేంద్ర కార్యాలయానికి చేరనున్న కోటి సంతకాలు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను పంపిస్తారు. వాటిని ఈనెల 18న గవర్నర్‌కి అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిలిపేయాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్…
గోదావరి పుష్కరాలు–2027 తేదీలు ఖరారు గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పుష్కరాల నిర్వహణపై కమిషనర్ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం…
రేపటి నుంచి గూడ్స్ రవాణా బంద్.. లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 9వ తేదీ నుంచి అంటే.. రేపటి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.. టెస్టింగ్, ఫిట్నెస్ చార్జీలు తగ్గించాలని ఆందోళనకు దిగుతోంది.. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్నెస్ ఫీజులు పెంపు విరమించాలని బంద్‌కు పిలుపునిచ్చింది.. కేంద్ర ప్రభుత్వం పెంచిన లారీ టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను వెంటనే తగ్గించకపోతే 12 ఏళ్లు…
అప్పుడే సంక్రాంతి రష్..! బస్సులు, రైళ్లన్నీ ఫుల్.. సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో, జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి…
ఐపీఎస్ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాపులకు సీఎం.. దళితులకు డిప్యూటీ సీఎం..! సస్పెన్షన్ లో వున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పొలిటికల్ కామెంట్స్ మరోసారి వేడిని రాజేశాయి. కాపు, దళితులతో రాజ్యాధికారం ఫార్ములాను ప్రతిపాదించి మరోసారి సంచలనం సృష్టించారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి.. దళితులకు డిప్యూటీ సీఎం కోసం ప్రణాళిక బద్ధంగా ఆలోచన చేయాలని సూచించారు సునీల్ కుమార్. ఆ దిశగా కాపులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనకాపల్లి…
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకానంద హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారి, సీఐ శంకరయ్యను డిస్మిస్ చేశారు పోలీసులు ఉన్నతాధికారులు.. ఎన్నో మలుపులు తీసుకున్న వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ జె.…
ఏపీలో మరో ప్రమాదం.. అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట్ట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుండి…