ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. మహిళ కిడ్నాప్‌నకు యత్నం..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర్ల సహాయంతో దొర్నిపాడు మండలం అర్జునపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హేమలత భర్త మాధవరెడ్డి 8 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తన పొలం విషయంలో నరసింహారెడ్డి అనే వ్యక్తి పంచాయతీ చేయగా.. అప్పటినుంచి వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.. పెళ్లి చేసుకోవాలనే కొంతకాలం ఇద్దరు బాగా కలిసి ఉన్నారు. అయితే, ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉన్నారు. హేమలత తనతో మాట్లాడడం లేదని ఆగ్రహం చెందిన నరసింహారెడ్డి భూమా అఖిలప్రియ అనుచరులతో కలిసి హేమలతను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా.. ఆమె కుటుంబీకులు, స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు హేమలత ఇంటిముందు వీరంగం సృష్టించారు. కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. బాధితులు దొర్నిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నరసింహారెడ్డితో పాటు నిఖిల్, సంపత్, మరో 7 మందిపై కేసు నమోదు చేశారు.
పర్యావరణ దినోత్సవం.. రాజధాని ప్రాంతంలో మొక్కలు నాటనున్న సీఎం, డిప్యూటీ సీఎం..
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి.. కొంత వరకు ఎండలు తగ్గి.. వర్షాలు కురిసినా.. వాతావరణ పరిస్థితులతో మళ్లీ ఎండలు మండుతున్నాయి.. అయితే, రెయిన్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మొక్కలు నాటేందుకు ప్రజలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాజధాని ప్రాంతంలోని అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో మొక్కలు నాటబోతున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకాబోతున్నారు.. ఏపీ అటవీ శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. అనంతవరం పార్కులో 1,000 మొక్కలు నాటబోతున్నారు.. ఈ పార్కు విస్తీర్ణం 34 ఎకరాలు కాగా.. దాదాపు 15 ఎకరాల్లో ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు..
బెంగళూరు తొక్కిసలాటలో ఏపీ యువతి మృతి..
18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ సొంతం చేసుకుంది.. ఇక, కప్ కొట్టిన తర్వాత తొలిసారి బెంగళూరులో అడుగుపెట్టిన ఆర్సీబీ టీమ్‌కు అపూర్వస్వాగతం లభించింది.. ఆనందంతో బెంగళూరు నగరం ఊగిపోయింది.. కానీ, ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన చిన్నస్వామి స్టేడియంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది.. ఉహించని విధంగా.. ఈ ఘటనలో ఏకంగా 11 మంది మృతి చెందాదారు.. దాదాపు 33 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది.. ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట ఘటనలో 11 మృతి చెందగా.. తొక్కిసలాటలో ఏపీకి చెందిన దేవి అనే యువతి కూడా మృతి చెందిందింది.. కోయంబత్తూరులో ఉద్యోగం చేసే దేవి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు పెద్ద అభిమాని.. ఆర్సీబీ ఐపీఎల్ కప్ కైవసం చేసుకోవడం.. ఆ జట్టు బెంగళూరుకు వస్తున్న నేపథ్యంలో.. కోయంబత్తూరు నుంచి బెంగళూరు చేరుకుంది దేవి.. కేవలం ఆర్బీసీ జట్టు కోసం బెంగుళూరు వచ్చింది.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గెలుపు సంబరాల సమయంలో ఊహించని ఘటనతో ప్రాణాలు విడిచింది.. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది..
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు
తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ కీలకదశకు చేరింది. టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న, టీటీడీ పూర్వ జేఈవో గౌతమితో పాటు మరికొంత మంది కీలక వ్యక్తులను సిట్ అధికారులు విచారించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో కల్తీ నెయ్యికి సంబంధించి రెండు రోజులుగా విచారణ సాగిస్తోంది. రెండు రోజులుగా సిట్ కార్యాలయంలో అప్పన్నను విచారించిన సిట్ అధికారులు కొంత మేర సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు సంధించిన ప్రధాన ప్రశ్నలకు వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న దాటు వేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న.. 2014 నుంచి 2019 వరకు ఒంగొలు ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఢిల్లీలో విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రోటోకాల్ ఓఎస్డీగా నియమించారు. ఏపీ భవన్ ఓఎస్డీ హోదాలో ఉంటూ… 2019 నుంచి 2023 వరకు నాలుగు సంవత్సరాల పాటు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి కార్యకలాపాలను చక్కపెట్టారు.
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
ఇవాళ తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగనున్నది. సెక్రెటేరియట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన, బనకచర్ల, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక మీదప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డీఏ, సమస్యలపైనా డిస్కన్ చేసే చాన్స్ ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అడిషినల్ డైరెక్టర్ పోస్టు, ఇతర విభాగాల్లో 16 పోస్టులు అడిషినల్ పోస్టులు, ఫ్యాప్సికి పన్ను మినహాయింపు, హ్యామ్ రోడ్స్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ప్రకటనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలు, ఫోన్‌ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, జీఎస్టీ, భూదాన్‌భూముల దందా, గొర్రెల స్కీం లాంటి స్కాముల సంగతి తేల్చాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఇప్పటికే పవర్ కమిషన్, కాళేశ్వరం రిపోర్టులు చేతికి అందడం, మిగిలిన ఎంక్వైరీలన్నీ తుదిదశకు చేరిన నేపథ్యంలో గురువారం జరుగబోయే కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
సోనమ్‌కు సంబంధించిన కీలక ఆధారం లభ్యం! అయితే ఆమె ఎక్కడున్నట్టు?
మేఘాలయలో తప్పిపోయిన ఇండోర్ మహిళ సోనమ్‌కు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు ఖాసీ హిల్స్ ప్రాంతంలో సోనమ్‌కు సంబంధించిన రెయిన్ కోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు. అయితే ఆ రెయిన్ కోట్ సోనమ్‌దా? కాదా? అని నిర్ధారిస్తున్నట్లు చెప్పారు. సీసీకెమెరాలో ఆమె రెయిన్ కోట్ వేసుకున్నట్లు కనిపించింది. దొరికిన రెయిన్ కోట్ ఆమెదేనా? కాదా? అని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వచ్చారు. మూడు రోజుల తర్వాత వారి ఆచూకీ గల్లంతైంది. దీంతో బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు జల్లెడ పట్టగా 10 రోజుల తర్వాత తూర్పు ఖాసీ హిల్స్ కొండ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడిపై ఉన్న గాయాలతో ఎవరో చంపినట్లుగా నిర్ధారించారు. కానీ అతడి భార్య సోనమ్ ఆచూకీ లభించలేదు. తాజాగా ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ దొరికింది. దానిపై రక్తపుమరకలు ఉన్నాయి. దీంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆ రెయిన్ కోట్ ఆమెదేనా? కాదా? అని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఇక ఆమె జాడ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శర్మిష్ట పనోలికి బెయిల్ నిరాకరించిన జడ్జికి బెదిరింపులు
బాలీవుడ్ నటులపై మత సంబంధమైన వ్యాఖ్యలు చేయడంతో పుణెకు చెందిన లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్‌లో పనోలిని అరెస్ట్ చేసి కోల్‌కతాకు తరలించారు. అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ శర్మిష్ట పనోలి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అందుకు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి పార్థ సారథిని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. బెయిల్ ఇవ్వకపోతే న్యాయమూర్తిని చంపేస్తామంటూ నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హెచ్చరిస్తున్నారు. కొందరు న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు చేయగా.. ఇంకొందరు న్యాయమూర్తికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. మరికొందరు బెయిల్ ఇవ్వకపోతే కచ్చితంగా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. జడ్జి అడ్రస్.. మొబైల్ నెంబర్లు ఇవ్వాలంటూ ఇంకొందరు పోస్టులు పెట్టారు. ప్రస్తుతం వీటిపై పోలీసులు దృష్టి పెట్టారు.
మృతుల కుటుంబాలకు 20 కోట్లు ఇవ్వాలి!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిసాయి. బుధవారం ఆర్సీబీ ఆటగాళ్లు అహ్మదాబాద్ నుంచి సొంతగడ్డకు వస్తుండడంతో.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి లక్షలాది మంది అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తమైంది. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం సంతాపం వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలానే మృతుల కుటుంబాలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది కానీ.. ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదు. దాంతో సోషల్ మీడియాలో ఆర్సీబీ యాజమాన్యంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో బయోపిక్‌ల్లో విక్కీ కౌశల్..
బాలీవుడ్ లో గడచిన పాతికేళ్లలో సూపర్ స్టార్లుగా ఎదిగింది కేవలం ఇద్దరే హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు, స్టార్లు హిందీ సినిమాలో ఎంట్రీ ఇచ్చినా సూపర్ స్టార్ రేంజ్ మాత్రం అందుకోలేకపోయారు. కానీ ప్రస్తుతం వరుస హిట్లతో పాటు నటన పరంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విక్కీ కౌశల్ బాలీవుడ్ నయా సూపర్ స్టార్‌గా అవతరించాడు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘చావా’ సినిమాలో విక్కీ నటనకు బాలీవుడ్ ఫిదా అయితే.. మరాఠా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో బాలీవుడ్ కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే తాజాగా.. విక్కీ కౌశల్ ‘ఇప్పుదాయన’ బయోపిక్లో నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా బాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లెజెండరీ దర్శకుడు గురుదత్ ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం పై విక్కీతో చర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అలా మీడియా సంస్థ రూపొందించనున్న ఈ బయోపిక్ విక్కీకౌశల్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
రెమ్యునరేషన్ తగ్గించిన ప్రభాస్..!
మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ డ్రామా గా వస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కొన్ని రోజులుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే ఈనెల 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడిస్తూ ప్రభాస్ కు సంబంధించి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ నుంచి మొదటిసారిగా హారర్ నేపథ్యం వస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది.