పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా.. నాలుక కోస్తా.. తొక్కిపెట్టి నార తీస్తా..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. కూటమి ప్రభుత్వం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.. అంతే కాదు, ధాన్యం బకాయిలు, తల్లికి వందనం ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తే నాలుక కోస్తా అంటూ హెచ్చరించారు.. వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడితే మాట్లాడండి తప్పులేదు.. కానీ, లండన్ లో తొంగునే నీకు దెందులూరు నియోజకవర్గం గురించి ఎందుకు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీ సొంత ఊరు వస్తా.. ప్రభుత్వంపై మీరు చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని అని సవాల్ విసిరారు చింతమనేని.. పథకాల అమలు విషయంలో ఎవరిని మోసం చేశామో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.. అసత్య ప్రచారాలు చేస్తే తొక్కిపెట్టినార తీస్తాను అంటూ సీరియస్ కామెంట్లు చేశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..
కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్.. 3 హత్యలు, 6 హత్యాయత్నాలు, 12 దాడులుగా..!
మరోసారి కూటమి ప్రభుత్వంపై సోషల్‌మీడియా వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని దుయ్యబట్టారు.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన జగన్.. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడిగా పేర్కొన్నారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం అన్నారు..
కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమంలో జలహారతి..
కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమం దగ్గర జలహారతి నిర్వహించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య , తదితరులు పాల్గొన్నారు.. పట్టీసీమ ద్వారా ఈ సంవ త్సరం 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి నిమ్మల.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పెర్రీ ఘాట్ పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మలో కలిసిన పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జాలాలకు జలహారతి ఇచ్చి పసుపు, కుంకుమతోపాటు చీర, సారెలను విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్ తాతయ్య, జిల్లా కలెక్టర్ తో కలిసి సమర్పించారు మంత్రి నిమ్మల.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడనీ పేర్కొన్నారు. కృష్ణ – గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబుదని, జగన్ పట్టిసీమను వట్టి సీమ చేస్తే చంద్రబాబు నదులకు జలకల సంతరించేలా చర్యలు చేపట్టారనీ తెలిపారు.
విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు..!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ విషయంలో సీరియస్‌గా ఉంది.. ఓ వైపు డ్రగ్స్, గంజాయి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు, గంజాయి సాగు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. అయితే, విశాఖ నగర నడిబొడ్డున గంజాయి సాగు కలకలం సృష్టించింది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జ్ఞానాపురం రాస వీధి సమీపంలోని ఓ పాడు బడ్డ ఇంటి దగ్గర ఖాళీ ప్రదేశంలో కొన్ని మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే, అవి గంజాయి మొక్కలను పోలినట్టే ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుమారు 15 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.. గంజాయి నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించారు.. అయితే, గతంలో, కొంతమంది గంజాయి సేవించే బ్యాచ్ ఈ ప్రాంతానికి వచ్చి గంజాయి సేవిస్తున్న సమయంలో మిగిలిన వాటిని పడేయడంతో ఈ మధ్య కురిసిన వర్షాలకి మొక్కలు మొలిచాయని స్థానికులు భావిస్తున్నారు.. మరోవైపు, విశాఖ నడిబొడ్డున్న కలకలం రేపిన ఈ గంజాయి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..
జగన్.. బంగారుపాళ్యం పర్యటనను వివాదం చేసే ప్రయత్నం..!
మాజీ సీఎం వైఎస్ జగన్ మామిడి రైతాంగాన్ని పరామర్శించే చిత్తూరు జిల్లా పర్యటనకు అడ్డుకునేందుకు.. బంగారుపాళ్యం పర్యటనను వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మూడు వేల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీసులను కాపలా పెట్టారు. అనేకమందిని హౌస్ అరెస్ట్ చేశారు. హెలీప్యాడ్ వద్ద జనం ఎక్కువ వచ్చారని లాఠీఛార్జ్ చేశారు. విచ్చలవిడిగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. పోలీసులు ఉంది లా అండ్ ఆర్డర్ కాపాడడానికా… జగన్ పర్యటనను అడ్డుకోవడానికా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
ప్రతి పైసాకు అకౌంటబిలిటీ.. మరింత పారదర్శకంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..!
దేశవ్యాప్తంగా మైనింగ్ రంగాన్ని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మాట్లాడారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) పై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉండేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో అక్రమ మైనింగ్ అనేది పెద్ద స్థాయిలో జరిగేదని గుర్తు చేసిన కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనింగ్ పూర్తి స్థాయిలో మైనింగ్ పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కేంద్రం డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా వచ్చే నిధులను మైనింగ్ వల్ల ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వినియోగిస్తున్నామని చెప్పారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ పుట్టినరోజు కానుకగా 20 వేల సైకిళ్ల పంపిణీ..!
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చేపట సేవా కార్యక్రమాల్లో భాగంగా.. ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పిల్లల విద్యాభ్యాసానికి ప్రోత్సాహంగా, ప్రధానమంత్రి మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. ముఖ్యంగా టెన్త్ తరగతి చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ స్వయంగా సైకిళ్లను అందజేస్తున్నారు. తొలిరోజు కరీంనగర్ టౌన్ విద్యార్థులకు అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ఈ పంపిణీ మొదలు కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అంబేద్కర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రితోపాటు కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సభకు హాజరవుతారు. మొత్తం నెల రోజుల వ్యవధిలో పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలల టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు సమయానికి సైకిళ్లు అందేలా చూసేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విద్యాశాఖ అధికారులకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతీ విద్యార్థినీ, విద్యార్థికి ఈ సదుపాయం అందేలా ప్రత్యేక నిఘా పెట్టారు.
7100mAh భారీ బ్యాటరీ, 50MP కెమరాతో వన్ ప్లస్ నార్డ్ CE5 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కోర్ ఎడిషన్ సిరీస్‌లో తాజా మోడల్ వన్ ప్లస్ నార్డ్ CE5 ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ జూలై 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్వేర్, దీర్ఘకాలిక బ్యాటరీతో వినియోగదారులను ఆకర్షించనుంది. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూద్దామా.. OnePlus Nord CE5 లో 6.77 అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లే ఉంది. దీని పీక్ బ్రైట్నెస్ 1430 నిట్స్ వరకు ఉంటుంది. దీనిలో Dimensity 8350 Apex 4nm ప్రాసెసర్ ను ఉపయోగించారు. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో CryoVelocity VC కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. ఇక ఇందులో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో.. 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా తో ఫుల్ HD 60fps వరకు వీడియో రికార్డింగ్ కి మద్దతు ఉంది. వెనుక కెమెరా 4K 60fps వరకు వీడియో తీసే సామర్థ్యం కలిగి ఉంది.
ఆ హీరోతో అవసరమా సాయి పల్లవి.. నెటిజన్స్ ట్రోలింగ్
సాయి పల్లవి.. ఈ పేరు సినిమాలో ఉంటె చాలు మినిమమ్ గ్యారెంటీ ఓపెనింగ్ ఉంటుంది. సాయి పల్లవి చూజ్ చేసుకునే సినిమాలు అలా ఉంటాయి. స్టార్ హీరో సినిమా అనో లేదా భారీ రెమ్యునరేషన్ వస్తుందని సినిమాలు చేయదు. చేసే నాలుగు సినిమాలైన మంచివి చేయాలనే ఉద్దేశంతో సెలెక్టీవ్ గా వెళ్తోంది. కానీ ఇప్పడు సాయి పల్లవి చేస్తున్న ఓ సినిమా పట్ల కాస్తంత నెగిటివీటి చూస్తోంది సాయి పల్లవి. అందుకు కారణం లేకపోలేదు. బాలీవుడ్ ఖాన్ హీరోలలో ఒకరైన అమిర్ ఖాన్ తాను సినిమాలు తగ్గించి తన కొడుకు జునైద్ ఖాన్ ను హీరోగా నిలబెట్టాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం తొలి సినిమాగా తమిళ్ సూపర్ హిట్ లవ్ టుడే ను లవ్ యాప పేరుతో రీమేక్ చేసాడు. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ హీరోయిన్ గా అరంగ్రేటం చేసిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయినా సరే అమిర్ తన జునైద్ ఖాన్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని తాపత్రేయపడుతున్నాడు. అందుకోసం ఈ సారి ఏకంగా సాయి పల్లవిని రంగంలోకి దింపాడు. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏక్ దిన్’ అనే ఈ సినిమాలో జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 7న రిలీజ్ కాబోతుంది. అమరన్ తర్వాత నితిన్ సరసన ఓ సినిమా కోసం సాయి పల్లవి సంప్రదించగా నో చెప్పిన ఈ భామ అసలు యాక్టింగ్ రాని జునైద్ ఖాన్ నటించేందుకు ఎలా ఒప్పుకుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి మూవీ నుంచి మరో మెగా షాకింగ్ సర్ప్రైజ్!
మెగాస్టార్ చిరంజీవి – కమర్షియల్ హిట్‌లలో దిట్ట అయిన అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా షూటింగ్ వేగంగా ముందుకు సాగుతోంది. నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మనకు తెలిసి అనిల్ రావిపూడి సినిమాలు అంటే ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన ఆసక్తి. ఎందుకంటే ఆయన స్టైల్లో ఉండే వినూత్న ప్రచార కార్యక్రమాలు సినిమాకు మరింత హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిరంజీవితో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో అయితే ఈ ప్రమోషన్‌కి మరింత వెయిట్ కలిగింది. సినిమా షూటింగ్ దశలోనే నయనతార క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇక తాజాగా.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో స్పెషల్ సర్ప్రైజ్ బయటకు వచ్చింది. ప్రముఖ ఛానల్ జీ తెలుగు లో ప్రసారమయ్యే ఓ ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుండగా, ఇప్పటికే రిలీజైన ప్రోమో వైరల్‌గా మారింది. అసలే బుల్లితెర ప్రేక్షకులకి చిరంజీవి ప్రత్యక్షంగా కనిపించడం అంటేనే పండుగ లాంటిది. దీంతో మెగా అభిమానులు, టీవీ వీక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాని డిజైన్ చేయడంలో అనిల్ రావిపూడి ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కంటెంట్‌ను టార్గెట్‌డ్ ప్రోమోషన్ రూపంలో వదులుతూ, సినిమా మీద బజ్‌ను నెమ్మదిగా పెంచుతున్నాడు. ఇది థియేటర్‌ల వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు ఉపయోగపడేలా ఉన్నది.
నాగ్ 100వ సినిమా.. అవసరమా అక్కినేని గారు
చిరంజీవి విశ్వంభర, అనిల్ రావి పూడి చిత్రాలతో బిజీ. బాలకృష్ణ అఖండ2 ఫైనల్ దశకు చేరుకోబోతోంది. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్, దృశ్యం3తో పాటు మరో త్రీ ఫిల్మ్ సెట్ చేశాడు. చిరంజీవి, బాలయ్య సినిమాలో క్యామియో అప్పీరియన్స్‌తో చెలరేగిపోతున్నాడు. కింగ్ నాగార్జున సంగతేంటీ. సోలో హీరోగా మళ్లీ కనిపించేది ఎప్పుడు. అని టెన్షన్ పడుతున్న నాగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్‌ను ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేం రా కార్తీక్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ వినిపిస్తోంది. నాగ్ తన వందవ చిత్రం కోసం ఆకాశం తప్ప మరో సినిమా చేయని రా కార్తీక్‌కు ఛాన్స్ ఇవ్వడం డేరింగ్ డెసిషనే. తమిళ నటుడు శశి కుమార్ నటించిన అయోతిని రీమేక్ చేయబోతున్నాడని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఫ్యాన్స్ ను కాస్త కలవరపెడుతోంది. ఈ మధ్య కాలంలో నాగార్జునకు రీమేక్స్ కలిసి రావడం లేదు. నాగ్ రీమేక్స్ చేయడం కొత్త కాదు. తన ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ నుండే చాలా సినిమాలు రీమేక్ చేశాడు. ఇప్పుడు వందవ చిత్రాన్నీ సెంటిమెంట్‌గా భావించి రీమేక్ లోడ్ చేయాలన్న యోచనలో పడినట్లున్నాడు కింగ్. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు రీమేక్స్ పెద్దగా అచ్చిరావడం లేదు. మన్మధుడు2, లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సో అయోతి రీమేక్ చేయడమన్నదీ పెద్ద రిస్కే. అందులోనూ ఈ ఓటీటీ యుగంలో ఇలాంటి ప్రయోగం చేయాలనుకోవడం కూడా నాగ్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. మరీ సెంటిమెంట్ కోసం రీమేకే నమ్ముకుంటాడా లేక సరికొత్త స్టోరీని ప్లాన్ చేస్తాడా అనేది రాబోయే రోజుల్లో క్లారిటి వస్తుంది.