ప్రపంచరికార్డు సృష్టించేలా అంతర్జాతీయ యోగా డే వేడుకలు.. విశాఖలో భారీ ఏర్పాట్లు
ప్రపంచరికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహిస్తుండగా.. విశాఖలోని ఆర్కే బీచ్ లో వందల మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ గణ బాబు, కలెక్టర్, సిటీ పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. జూన్ 21 విశాఖలో జరిగే యోగా డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. వేలాది మందితో కలిసి ఆయన యోగాసనాలు వేయనున్నారు.. ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌గా ప్రభుత్వం తీసుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఐదుగురు మంత్రులతో కమిటీ నియమించి బాధ్యతలు అప్పగించింది. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో ప్రచారం చేపట్టి ప్రజలను సన్నద్ధం చేసేందుకు నెలరోజుల పాటు ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లలు తీసుకోవాలని, అదే విధంగా స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను, డ్వాక్రా మహిళలను, ప్రైవేటు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని నిర్దేశించింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు, అదే విధంగా పార్క్ హోటల్ నుండి భీమిలి బీచ్ రోడ్ వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనే అవకాశం వుంది.
పుష్ప మూవీలో మంగళం శ్రీను లాంటి వ్యక్తి..! మాజీ మంత్రి అనిల్‌పై రూప్ కుమార్ సెటైర్లు..
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మాజీ మంత్రి అనిల్ ని పుష్ప మూవీలో మంగళం శ్రీను తో పోల్చి విమర్శలు గుప్పించారు.. కరోనా సమయంలో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించి మాజీ మంత్రి అనిల్ లక్షల రూపాయలు దండుకున్నారు.. 7 లక్షల రూపాయలకి షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ అమ్ముకున్నాడు.. అలాంటి వ్యక్తి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (VPR) మీద విమర్శలు చెయ్యడం దారుణం అన్నారు.. ఇరిగేషన్ పనుల్లో కమిషన్స్ పేరుతో అనిల్ కోట్ల రూపాయలు దోచుకున్నారు.. బర్రెల సంత దగ్గర మాజీ మంత్రి అనిల్ కోటి రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించాడు.. అధికారం పోయిన తర్వాత చెన్నై కి వెళ్లి దాక్కున్నాడని.. దుబాయ్ లో పెట్టుబడులు పెడుతున్నాడని మండిపడ్డారు.
యోగాంధ్ర పేరుతో నెల మొత్తం యోగా.. ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు.. ఇక, ఇవాళ్టి నుంచి యోగా మంత్ ప్రారంభం అవుతుంది.. యోగాంధ్ర పేరుతో నెల మొత్తం యోగా జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగాడేతో ప్రపంచంలో రికార్డులు బద్దలు అవ్వాలి.. 2 కోట్ల మందిని రాష్ట్రంలో భాగస్వామ్యం చెయ్యాలి.. మీడియా కూడా యోగాను ప్రమోట్ చేశారు. ప్రధాని ప్రపంచం మొత్తం యోగ ప్రమోట్ చేశారు. కాబట్టి వివిధ మాధ్యమాల్లో యోగా ప్రచారం జరగాలన్నారు ఏపీ సీఎం.. ఇప్పటికే మంత్రులతో ఒక కమిటీ ఉంది.. గ్రామ స్థాయిలో కూడా కలిపి ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తాం అన్నారు.. ప్రతి ఇంటిలో యోగా ప్రచారం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో జూన్ 21వ తేదీన 5 లక్షల మందితో యోగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఏపీకి రానున్న కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే..
అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న పంట పొలాలను ధ్వంసం చేస్తూ.. ఊళ్లపై దాడులు చేస్తే.. ఎంతో మంది రైతులు, స్థానికుల ప్రాణాలు తీశాయి ఏనుగుల గుంపులు.. వీటితో అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న రైతులకు కంటిమీద కునుకే కరువైంది.. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కుంకీ ఏనుగులను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు.. దానికోసం బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు.. ఆ తర్వాత కర్ణాటక మంత్రి అమరావతి రావడంతో ఆంధ్రప్రదేశ్-కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అప్పగింతపై ఒప్పందం కుదురింది.. దానిలో భాగంగా ఈరోజు ఏపీకి కర్ణాటక ప్రభుత్వం ఆ కుంకీ ఏనుగులను అందించనుంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఐదు కుంకీ ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం.. ఈ లోపే వాటి పేర్లను విడుదల చేశారు.. మొత్తం ఐదు కుంకీ ఏనుగులు ఏపీకి రానుండగా.. 1. రంజని, 2. దేవా, 3. కృష్ణా, 4. అభిమన్యు, 5. మహేంద్రగా ప్రకటించారు.. ఈ కుంకీ ఏనుగులకు సంబంధించిన ఏనుగుల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.. కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. కింద కుంకీ ఏనుగులకు సంబంధించిన నేమ్ బోర్డులు చూడొచ్చు..
మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు తెలిసింది. అయితే, మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హుజూర్ నగర్ మండలం మేళ్ల చెరువులో ల్యాండ్ కావాల్సి ఉండగా.. మబ్బులు కమ్ముకోవడం, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, అత్యవసరంగా కోదాడలో ల్యాండ్ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్.. కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు.
కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలను గాలికి వదిలి నోటీస్ లు ఇస్తున్నారని రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందన్నారు. చట్టాల మీద విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులిచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ మండిపడ్డారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకాలు ఆడుతోంది.. కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు.. పాలన కనిపించడం లేదు.. డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే “కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు” అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు.. ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోంది – ప్రజల పాలన కాదు.. సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. SLBC టన్నెల్ కూలింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు.. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది.. మీ కమిషన్‌ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు.. సోనియా, రాహులే కీలకం!
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు గుప్పించింది. ఈ నేరంలో వీరు 142 కోట్ల రూపాయల లబ్ధి పొందారని పేర్కొనింది. ఈరోజు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ తరపు లాయర్ ఈ వాదనలు వినిపించారు. అయితే, నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో సోనియా, రాహుల్ గాంధీలకి గతంలో పలుమార్లు ఈడీ అధికారులు విచారణ చేశారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి నడిపించారన్న ఫిర్యాదులతో ఈడీ, సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే నిలిచిపోయినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు స్టార్ట్ చేసింది.
48 గంటల్లో గాజాలో 14 వేల మంది పిల్లలు చనిపోవచ్చు.. యూఎన్ హెచ్చరిక
గాజా పరిస్థితి దయనీయంగా మారింది. తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా మానవతా సాయం నిలిచిపోవడంతో ఆహారం, నీళ్లు లభించక విలవిలలాడిపోతున్నారు. దీంతో యూఎన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ఆహారం అందకపోతే వేలల్లో పిల్లలు చనిపోతారని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజాను పూర్తిగా ఇజ్రాయెల్ నాశనం చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. ప్రజలకు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇక చిన్న పిల్లల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. పోషకాహార లోపంతో పిల్లలు కృషించి పోతున్నారు. యుద్ధం కారణంగా స్వచ్చంధ సంస్థలు అందించే ఆహారం నిలిచిపోవడంతో గాజాలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సరైన వైద్యం అందక కూడా నీరసించి పోయారు. దీంతో తాజాగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. సోమవారం ఐదు ట్రక్కుల ఆహారం మాత్రమే గాజాలోకి ప్రవేశించాయని యూఎన్ తెలిపింది.
ఒక్క సీజన్లో ఇన్ని రికార్డులా.. విధ్వంసానికి మొగుడిలా ఉన్నావే..
బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. గతవేలంలో రాజస్థాన్ ఈ పద్నాలుగేళ్ల పిల్లాడిని కోటి రూపాయలకు దక్కించుకుంది. తొలి మ్యాచ్‌తోనే వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ కొట్టి తన సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 34 పరుగులతో సత్తా చాటాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై నెలకొల్పాడు. 38 బంతుల్లో 101 పరుగులతో ఊచకోత కోశాడు. తరువాతి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. తాజాగా చెన్నైపై హాఫ్ సెంచరీ చేసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాడు. వైభవ్ ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 2010లో 37 బంతుల్లో సెంచరీతో అగ్రస్థానంలో ఉన్న యూసుఫ్ పఠాన్‌ను వైభవ్ అధిగమించాడు. ఇంకా 20 ఏళ్ల వయసులోపు అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.ఈ సీజన్లో అతను మొత్తం 24 సిక్సర్లు కొట్టాడు. అత్యధిక స్ట్రైక్ రేట్ కూడా వైభవ్ పేరిటే ఉంది. 206 స్ట్రైక్ రేట్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. మూడో పాట అసుర హననం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిజ జీవిత యోధుడు వీరమల్లు జీవిత కథ ఆధారంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సహా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతుండగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండు పాటలు విశేషంగా ఆకట్టుకోగా తాజాగా మూడో పాట విడుదల చేశారు. అసుర హననం అంటూ సాగిన ఈ సాంగ్ అనుకున్నట్టుగానే మంచి పవర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. కీరవాణి ఇచ్చిన ట్యూన్ సహా రాంబాబు గోసల సాహిత్యం స్టన్నింగ్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం ప్లే బ్యాక్ సింగర్స్ తోనే పాడించిన, ఈ పాట వింటుంటే ఒళ్ళు నిక్కబొడుచుకుంటుంది. అంతే కాదు ఈ లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా బాగున్నాయి. పవన్ పై పలు పోరాట సన్నివేశాల దృశ్యాలు ఒక్కోక్కటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మొత్తానికి రెండు సింపుల్ సాంగ్స్ తర్వాత మంచి పవర్ సాంగ్‌ని మేకర్స్ ఇపుడు విడుదల చేసారు. ఇక ఈ చిత్రం ఈ జూన్ 13న పాన్ ఇండియా భాషల్లో సినిమా విడుదల కాబోతుంది.
‘థగ్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన కమల్..!
లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, దర్శకుడు మణిరత్నానికి చెందిన మద్రాస్ టాకీస్, ఉదయనిధి స్టాలిన్‌కు రెడ్ఫి జెయింట్ ఫిలింస్ మీద సినిమా రూపొందింది. ఇక.. ఇటి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రాగా. ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఓ మీడియాతో ముచ్చటించగా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? అంటే.. ‘ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే మా సినిమా ఓటీటీ లోకి వస్తుంది’ అని కమల్ హాసన్ స్పష్టం చేశారు. కాగా ఈ ‘థగ్ లైఫ్’ ఓటీటీ హక్కులను ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారట.