బీఆర్ఎస్ సభకు నాందేడ్ ముస్తాబు
ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. నేడు నాందేడ్ కు సీఎం కేసీఆర్ బయలు దేరనున్నారు. అక్కడ భారీ భహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కేసీఆర్ సమక్షంలో మరాఠా నాయకులు బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. అయితే నాందేడ్ సభలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ నాందేడ్ రానున్న నేపథ్యంలో సభా ప్రాంగణం అంతా ముస్తాబైంది. కేసీఆర్ ప్రసంగంతో నాందేడ్ దద్దరిల్లనుంది. కేసీఆర్ రాకకోసం నాందేడ్ గులాబీ మాయం అయింది. మరాఠీ భాషలో భారీగా బ్యానర్లు, హోర్డింగ్ లు దర్శనమిస్తున్నాయి. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్‌లో సభా వేదిక అందంగా ముస్తాబైంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, నలు దిశలా, ఎయిర్‌పోర్ట్ నుంచి సభా వేదిక వరకు దారిపోడవునా గులాబీ తోరణాలు, కేసీఆర్ చిత్రపటాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సభా వేదికతోపాటు, పార్కింగ్, మీడియా గ్యాలరీలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దాదాపు 25 వేల మందికిపైగా కూర్చునేందుకు వీలుగా టెంట్‌ను వేశారు.
జగన్ ని వీడితే ప్రాణం పోతుందని.. ఇప్పుడిలా?
నెల్లూరు జిల్లా రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి, మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. కోటంరెడ్డికి ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సెక్యూరిటీని 2+2 నుంచి 1+1 కి తగ్గించింది. ఇదిలా ఉంటే… కోటంరెడ్డిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కావలి. ఎం.ఎల్.ఏ.రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోటంరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ వీడటం చాలా బాధాకరమైన విషయం.ఆయన తోడేళ్ళను నమ్మి వెళుతున్నాడు. ఆయన జీవితం ఎలా అవుతుందో తెలియదన్నారు. మన వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు సరిగ్గా తిరుగుతున్నామా లేదా అనే విషయంలో వీడియోలు తీస్తుంటారు.ఆ విషయంలో ఏదైనా శ్రీధర్ రెడ్డి పొరపాటు చేసి ఉండవచ్చు దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మందలించి ఉండవచ్చు. దానికే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఎన్నో రోజులు కలిసి మెలిసి ఉన్నాము. చంద్రబాబు లాంటి తోడేళ్లతో పోకుండా ఉండాలన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. బతికున్నంత కాలం జగనన్నతో నిలబడతాను అన్నావు. గతంలో నా ప్రాణం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి తోనే నిలబడతాను అన్నావు. నేను జగన్మోహన్ రెడ్డికి దూరమైతే నా ప్రాణం పోయినట్లే అని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ మాట ఏమైందో అన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.
బడ్జెట్ ఆమోదమే ఎజెండా.. నేడు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్‌ను ఆమోదించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇవాల ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగనుంది. బడ్జెట్ పై చర్చించిన తర్వాత ఆమోదించనుంది. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఈ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గదర్శనం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇక, పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు కేసీఆర్.. అయితే, కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం తప్ప ఎజెండాలో ఇతర అంశాలు ఏమి లేవని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. కొండ ప్రాంతాల్లో ఉండేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకు, లంబసింగిలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో చలి కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కి పడిపోయాయి కనిష్ట ఉష్ణోగ్రతలు.ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 6.9కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదు అయింది. కొమురం భీం జిల్లా సిర్పూర్ 7.7 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదవగా.. నిర్మల్ జిల్లా కుంటాలలో 9.9 డిగ్రీలుగా వుంది. మంచిర్యాల జిల్లా ర్యాలీ లో11.5 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు. సంక్రాంతి తర్వాత చలి తీవ్రత పెరిగిందని.. తెలంగాణలో దీని ప్రభావం మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఐదేళ్ల జైలు
దాయాది దేశమైన పాకిస్తాన్ నూతన బిల్లును సిద్ధం చేసింది. సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించనుంది. పాకిస్తాన్ ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని మార్చాలని ప్రతిపాదించిన బిల్లును సిద్ధం చేసింది. దేశంలోని శక్తివంతమైన సైన్యాన్ని, న్యాయవ్యవస్థను ఏ మాధ్యమం ద్వారా అపహాస్యం చేసినా లేదా అపహాస్యం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ.1 మిలియన్ జరిమానా లేదా రెండూ కూడా విధించబడతాయి. ముసాయిదా బిల్లును న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలించింది. ప్రధాన మంత్రి, సమాఖ్య మంత్రివర్గం ఆమోదం కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బిల్లును పంపినట్లు తెలిసింది. ఇది పాకిస్తాన్ శిక్షాస్మృతి (PPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సవరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా సైన్యం, కోర్టులపై విమర్శలతో నిండినందున త్వరలో ప్రతిపాదించబడిన బిల్లు లక్ష్యాన్ని కేబినెట్ సారాంశం స్పష్టంగా వివరిస్తుంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, సారాంశం, బిల్లు త్వరలో ఫెడరల్ కేబినెట్‌కు పంపబడుతుందని నివేదిక పేర్కొంది. క్రిమినల్ లాస్ (సవరణ) చట్టం, 2023 పేరుతో, బిల్లు కొత్త సెక్షన్ 500ఏని సూచిస్తుంది. న్యాయవ్యవస్థ, సాయుధ బలగాలు లేదా వారి సభ్యుల్లో ఎవరినైనా అపహాస్యం చేసే లేదా అపహాస్యం చేసే ఉద్దేశ్యంతో ఎవరైనా ఏదైనా ప్రకటన చేసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా లేదా సమాచారాన్ని ఏ మాధ్యమం ద్వారానైనా ప్రసారం చేసినా, కొంత కాలం పాటు సాధారణ జైలు శిక్షతో కూడిన నేరానికి పాల్పడతారని ఇది పేర్కొంది. ఇది ఐదు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు లేదా రూ.1 మిలియన్ వరకు జరిమానా విధించవచ్చు. ఈ రెండూ కూడా ఒక్కోసారి విధించవచ్చు.
ఆ ఇంటి చుట్టూ గ్రైనేడ్లు… ఇదేంట్రా నాయనా
అందరికీ వారి ఇంటిని అలంకరించడం అంటే ఇష్టం. కొందరు తమ ఇంటిలోని వివిధ గదుల కోసం రకరకాల వస్తువులను కొనుగోలు చేసి తమ టేస్ట్ కు తగ్గట్లు అందంగా అలంకరించుకుంటారు. కుండీలు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్ హ్యాంగింగ్‌లు, ఫ్యాన్సీ క్రాకరీ, ల్యాంప్స్, శిల్పాలతో డెకరేట్ చేస్తారు. అయితే, ఒక వ్యక్తి అందరి కంటే వెరైటీగా ఆలోచించాడు. తన ఇంటిని గ్రెనేడ్‌లతో అలంకరించాడు. కానీ అవి పనిచేసేవని గ్రహించలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి లైవ్ గ్రెనేడ్‌లను తొలగించారు. విస్తూపోయే ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. సమ్మర్‌కోర్ట్‌లోని కార్న్‌వాల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటి అలంకరణ కోసం మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లను కొనుగోలు చేశాడు. ఇంట్లోని ఒక చోట వాటితో డెకరేట్ చేశాడు. కాగా, జనవరి 31న రొటీన్ తనిఖీల సందర్భంగా ఆ ప్రాంత పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆ వ్యక్తి ఇంట్లో అలంకరించినవి లైవ్ గ్రెనేడ్లు అని గుర్తించి షాకయ్యారు. వాటిని తొలగించేందుకు రాయల్ నేవీకి చెందిన ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ బృందాన్ని రప్పించారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆ ఇంటి సమీపంలోని రోడ్డును మూసివేశారు. అలాగే సేఫ్టీ కోసం పొరుగు ఇంట్లోని వారిని కూడా ఖాళీ చేయించారు.
కలకలం సృష్టించిన బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
అణ్వాయుధ స్థావరాలు మీదుగా ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్‌ను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ గుర్తించింది. అధ్యక్షుడు జో బైడెన్ సూచన మేరకు డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, ఉన్నత సైనిక అధికారులు బెలూన్‌ను పేల్చివేయాలని భావించారు.. కానీ, అలా చేయడం ప్రమాదని డిఫెన్స్ సీనియర్ అధికారి అన్నారు. వాయువ్య ప్రాంతంలో సున్నితమైన ఎయిర్‌బేస్‌లు, క్షిపణి వ్యవస్థలున్న సిలోస్ అండర్‌గ్రౌండ్ మీదుగా ఈ గూఢచారి బెలూన్ ఎగురుతోందని చెప్పారు. చివరకు దాన్ని కొన్ని గంటల క్రితం ఆ బెలూన్ ను తమ దేశ యుద్ధ విమానాల సాయంతో సముద్రతలాల వైపునకు తీసుకొచ్చి పేల్చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దీనిపై చైనా స్పందించింది. మానవరహిత బెలూన్ ను పేల్చివేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, బెలూన్ ను పేల్చిన దృశ్యాలను అమెరికా వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి. బెలూన్ ను ఎఫ్-22 యుద్ధ విమారనం సాయంతో పేల్చేశాయి. దక్షిణ కాలిఫోర్నియా మర్టల్ బీచ్ ప్రాంతంలో ఆ బెలూన్ శకలాలు పడ్డాయి. వాటిని సేకరించేందుకు మిలటరీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, చైనా మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ బెలూన్ కలకలం రేపడం గమనార్హం. తైవాన్ విషయంతో పాటు చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. చైనా బెలూన్ ను అమెరికా మిలటరీ విమానం నుంచి కూడా అధికారులు ముందుగా పరిశీలించారు. ఈ విషయాన్ని చైనా అధికారుల ముందు కూడా అమెరికా అధికారులు లేవనెత్తారు.
డాన్ కాస్త దాబాలో వంటోడయ్యాడు.. కాలం కలిసి రాలేదు
ఓడలు బండ్లు కావడం.. అంటే ఇదే నేమో.. అప్పటి వరకు అతడిని చూసిన వారెవరైనా హడలిపోవాల్సిందే. కానీ కాలం కలిసి రాలేదు.. డాన్ కాస్త దాబాలో పిజ్జాలు చేసుకుంటున్నాడు. ఓ కేసులో 16ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే జరుగుతాయి.. కానీ నిజంగా ఇటలీలో జరిగింది. ఇటలీకి చెందిన ఒక మాఫియా డాన్ 16 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా హంతకుడు ఫ్రాన్స్‌లో పిజ్జాలు తయారు చేస్తూ బతుకుతున్నాడు.
ఇటలీకి చెందిన మాఫియా డాన్ ఎడ్గార్డో గ్రేకో అక్కడ అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఆ దేశంలో ‘ఎండ్రాంగెటో’ అనే మాఫియా సంస్థను నడిపించాడు. అతడిపై అనేక కేసులు నమోదయ్యాయి. ‘ఎండ్రాంగెటో’.. ఇటలీలోనే అత్యంత భయంకరమైన మాఫియా గ్రూప్. దశాబ్దాల క్రితం నుంచి ఈ గ్రూప్ ఇటలీలో పలు హత్యలు, దారుణాలకు పాల్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మాఫియా గ్రూప్ కొకైన్ వంటి మత్తు పదార్థాలు సరఫరా చేసేది. ఇప్పటికీ ఈ గ్రూపు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల పలువురు సభ్యుల్ని ఇంటర్‌పోల్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం ఈ గ్రూప్‌నకు చెందిన మరో మాఫియా లీడర్ మాట్టెయో మెస్సినా డెనారోను ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఎడ్గార్డో గ్రెకో విషయం బయటపడింది. అతడు ఫ్రాన్స్‌లోని కేఫ్ రొస్సిని రెస్టారెంట్‌లో పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇంటర్‌పోల్ పోలీసులు అతడిని తాజాగా అరెస్టు చేశారు.