తెలుగు చిత్ర పరిశ్రమ సాహిత్య శిఖరం సిరివెన్నల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈ నెల 24న న్యూమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్ర తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు స్పందిస్తూ.. సాహిత్య మేధావి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి. రెస్ట్ ఇన్ పీస్ సార్ అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.