దేశంలో 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇవాళ ముగిసింది. గురవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల తర్వాత లైన్ నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతించారు.
మునుగోడు ఉప ఎన్నిక సమీపించేకొద్దీ మద్యం వెల్లువెత్తుతోంది. దీంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు కోళ్లు, మేకల తలలు తెగిపడుతున్నాయి.. తాగినోళ్లకు తాగినంత, తిన్నోళ్లకు తిన్నంతగా ప్రధాన పార్టీల నిత్య విందులు సాగుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య దూరం బహిర్గతం అవుతోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పలుమార్లు తనిఖీ నిర్వహించారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని BJP పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో TRS నాయకులు, శ్రేణులు కుంగిపోతున్నాయని అన్నారు.