Lotus Pond: హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై ఓ యువతి అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
జగన్.. తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.50 కోట్ల ప్రభుత్వ ధనంతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. " సీఎం హోదాలో తాను తీసుకున్న ఫర్నిచరును జగన్ తిరిగి అప్పగించ లేదు.
ఇందిరాపార్క్ వద్ద దీక్షకు బయలుదేరిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు.
YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు.
తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యం అంటున్నారు.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్.. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల కోసం పనిచేస్తోంది. ఇవాళ లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిలతో భేటీ…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.. ఇప్పటికే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్ చేశారు.. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు.. ఈ నేపథ్యంలో… రేపు అన్ని జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.. రేపు ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్ లో ఈ సమావేశం జరగనుండగా… జూలై 8న పార్టీ ఆవిర్భావం, పార్టీ బలోపేతం,…
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు. అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు. ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మూడు రోజులపాటు దీక్ష చేస్తున్నట్టు ఏప్రిల్ 9 వ తేదీన…