సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్మీషియా మైనర్ యువతి సామూహిక అత్యాచారం మరువక ముందే మరో స్టార్ హోటల్ లో ఓ యువతిపై యువకులు దాడి చేసి, రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్న బాధిత యువతి ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రూఫ్ టాప్ పబ్ లాంజ్ కు వెళ్ళింది. కాసేపు సరదాగా గడిపింది. దీంతో అక్కడ వున్న 8మంది యువకుల కన్ను బాధిత యువతి పై పడింది. దీంతో.. అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా బాటిళ్ళతో దద్దరిల్లింది. పబ్ లోనే బాధితురాలి పై 8 మంది యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలి వద్దకు వచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగారు. బాధితురాలు నెంబర్ ఇవ్వడానికి నిరాకరించడంతో.. పదే పదే ఆమె పై దాడి చేశారు.
పక్కకి తీసుకెళ్లిన అబ్రార్ , సాధ్ అనే యువకులు అమెపై దాడి చేయడమే కాకుండా .. అసభ్యంగా ప్రవర్తించారు. రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అడ్డు వచ్చిన బాధితురాలి స్నేహితురాలిపై 8మంది యువకులు మద్యం సీసాలతో దాడికి దిగారు. అడ్డుకోబోయిన పబ్ నిర్వహకుల పైన బెదిరింపులకు పాల్పడ్డారు. ఈఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో.. పబ్ నుంచి నేరుగా హాస్పిటల్ కి వెళ్ళింది. చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పబ్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేసింది బాధితురాలు. అయితే వీరంతా బడాబాబుల కొడుకులుగా గుర్తించినట్లు సమాచారం.
తల్లిదండ్రుల పేరు చెప్పుకుని ఇప్పటికే జూబ్లీహిల్స్ ఘటన కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఇలాంటి బడాబాబుల పిల్లలు మాత్రం మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతూనే వున్నారు. వారికి ఏంజరిగినా చట్టం వారికి చుట్టంగా మారిందని అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడేందుకు వెనుకాడటం లేదు. కాగా.. యువతులపై మద్యం బాటిళ్ళతో విక్షణారహితంగా దాడి చేసి, బెదిరించిన బడాబాబుల పిల్లలపై పోలీసులు రియాక్షన్ ఎలా వుంటుంది. ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో యువతులు భయాందోళనలకు గురవుతున్నారు.
NTR31: తారక్‌కి జోడీగా ఆ బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్..?