సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్మీషియా మైనర్ యువతి సామూహిక అత్యాచారం మరువక ముందే మరో స్టార్ హోటల్ లో ఓ యువతిపై యువకులు దాడి చేసి, రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్న బాధిత యువతి ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రూఫ్ టాప్ పబ్ లాంజ్ కు వెళ్ళింది. కాసేపు సరదాగా గడిపింది. దీంతో అక్కడ వున్న 8మంది యువకుల…