jubilee hills police petition to consider minors as majors in amnesia pub case: హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై సామూహిక అత్యాచార నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు…
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్మీషియా మైనర్ యువతి సామూహిక అత్యాచారం మరువక ముందే మరో స్టార్ హోటల్ లో ఓ యువతిపై యువకులు దాడి చేసి, రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్న బాధిత యువతి ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రూఫ్ టాప్ పబ్ లాంజ్ కు వెళ్ళింది. కాసేపు సరదాగా గడిపింది. దీంతో అక్కడ వున్న 8మంది యువకుల…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇప్పటికే బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు,పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్‌కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్ లైంగిక…
మసిఉల్లా.. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు మసిఉల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక కేసులో ఆయన పేరును ముడిపెడుతూ విపక్షాలు అంతెత్తున లేస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఈ వ్యవహారంలో అధికారపార్టీ ఏం చేస్తుందనే చర్చ మొదలైంది. తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు మసిఉల్లా. ఇటీవలే తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యారు. అయితే మసిఉల్లా…
హైదరాబాద్ అమినేషియా పబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మైనర్ రేప్ కావడంతో పొలిటికల్ గానూ రచ్చ రచ్చ అవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలు ఉండటంతో, టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయి విపక్షాలు. రేప్ కేసులో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు పాత్ర ఉందని పోలీసులు తేల్చారట. కేసు పూర్తి విచారణ అయితేగాని ఎవరి పాత్ర ఏమిటో తేలే అవకాశం ఉంది. తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్…
జూబ్లీ హిల్స్ లో జరిగిన అత్యాచార ఘటన సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ ఘటన పై ఆరా తీశారు. పూర్తి నివేదికను అందజేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. బాలిక అత్యాచార ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై రెండురోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. జూబ్లీహిల్స్ రోడ్ లోని అమ్నీషియా…
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. నిన్న బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో అమ్మాయిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎం.…
తెలంగాణ వ్యాప్తంగా ఆమ్నేషియా పబ్, అమ్మాయిపై సామూహిక అత్యాచార ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. కావాాలనే కేసును పక్కదారి పట్టిండానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో పలువురు ప్రముఖులు పిల్లలు ఉండటంతో కేసులో నిందితుల పేర్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై, ఇటు పోలీసులపై ప్రతిపక్షాలు ఒత్తడి పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అమ్మాయిపై…
ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్…