ఫుట్‌బాల్ క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్పెయిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు క్రీడాకారులు దుర్మరణం చెందారు. లివర్‌పూల్ ప్లేయర్ డియోగో జోటా (28), అతడి సోదరుడు ఆండ్రీ (26) ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. డియోగో జోటా రెండు వారాల క్రితమే ప్రియురాలు రూట్ కార్డోసోను వివాహం చేసుకున్నాడు. ఇంతలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ వార్త అభిమానులను తీవ్రంగా కలిసివేస్తోంది.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వైఎస్ జగన్‌ను కలిసిన వంశీ.. అండగా ఉంటామని భరోసా!
వాయువ్య స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లోని ఏ-52పై కారు రోడ్డు పక్కన పడి ఉంది. అయితే ప్రమాదం జరగగానే కారులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:40 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో ఇద్దరు చనిపోయినట్లు ప్రాథమిక నివేదికలు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. తిట్టారన్న కోపంతో తల్లి, కొడుకును చంపేసిన పని మనిషి
డియోగో జోటా.. సెప్టెంబర్ 2020లో వోల్వర్‌హాంప్టన్ వాండరర్స్ నుంచి 40 మిలియన్లకు పైగా ఫీజుకు లివర్‌పూల్ తరపున సంతకం చేశాడు. స్నేహితురాలు రూట్ కార్డోసోను రెండు వారాల క్రితమే వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇంతలోనే కారు రూపంలో మృత్యువు కబళించింది. ఇక ఆండ్రీ.. పోర్చుగీస్ సెకండ్ డివిజన్ క్లబ్ అయిన పెన్నాఫియల్ తరపున ఫుట్‌బాల్ ఆడాడు.
