1. నేడు కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. అయితే వేకువజాము నుంచే స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
2. నేటి నుంచి ఈ నెల 30 వరకు సీపీఐ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో సీపీఐ ఆందోళనలు తెలుపనుంది.
3. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,100లుగా ఉంది.
4. నేడే ఐపీఎల్ సీజన్15లో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. లక్నోతో తలపడనున్న బెంగళూరు జట్టు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభ కానుంది.
5. అమలాపురంలో నిన్న చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో నేడు ఆర్టీసీ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.