1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
2. నేడు తిరుపతి, శ్రీకాళహస్తిలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
3. నేటి నుంచి వైసీపీ ప్లీనరీపై పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాల నిర్వాహణ జరుగనుంది.
4. నేడు ఈడీ విచారణకు హాజరుకాలేనన్న సోనియా గాంధీ.
5. నేడు చైన్నైలో అన్నాడీఎంకే జనరల్ బాడీ మీటింగ్ జరుగనుంది.
6. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,450లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,000లుగా ఉంది.