Ranga Reddy: నిన్నేమో కిలో రూ.250.. ఇవాళ చేపలన్నీ నేలపాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లాలో చేపలు వృధాగా పారవేయడం కలకలం రేపింది. మార్గశిర మాసం మొదలవడంతో.. చేపల కోసం మార్కెట్లకు ప్రజలు క్యూకట్టారు. దీంతో చేపలకు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఎక్కువ రేటు వున్నాకూడా వినియోగదారుడు చేపలు కొనడానికి వెనుకంజ వేయలేదు. అయితే అది నిన్నటి మాట. రంగారెడ్డిజిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో నిర్వాహకులు చేపలను వృధాగా పడేయడం కలకలం రేపుతోంది.
గంగపుత్ర సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే చేప పిల్లల పెంపకం నేల పాలయ్యింది. మార్గశిర మాసం కావడంతో.. కిలో చేపల ధర 250-300 రూపాయలు పలికింది. కొన్ని చేపలు అమ్ముడు పోయాయి… మరికొన్ని చేపలు వృధాగా వుండిపోయాయి. దీంతో నిర్వాహకులు అమ్మకం తర్వాత పెద్ద ఎత్తున చేపలను పరిసర ప్రాంతంలోనే పారవేశారు. దీంతో.. ఇది చూసిన గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
మున్సిపాలిటీ వారు. ప్రభుత్వం వారు కానీ ధరలను నిర్దేశించలేదు.వీరు ఇస్టానుసారంగా ధరలను పెంచేసి సామాన్యుడికి అందనంత విధంగా చేపలను అధిక ధరకు అమ్మారు. మిగిలినవి అక్కడ పడేసి వెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు మండిపడుతున్నారు. ఇకపై స్థానికంగా ఉండే గ్రామస్తులకు వారు కొనే ధరలకే అమ్మాలని, లేదంటే గంగపుత్ర సంఘాలను సాగనంపి.. గ్రామస్తులకు చెరువు కేటాయించాలని కోరుతున్నారు. చేపలను ఇలా వృధాగా ఇష్టాను సారంగా పారబోసిన వారిపై మున్సిపాలిటీ కమీషనర్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!