రంగారెడ్డి జిల్లాలో చేపలు వృధాగా పారవేయడం కలకలం రేపింది. మార్గశిర మాసం మొదలవడంతో.. చేపల కోసం మార్కెట్లకు ప్రజలు క్యూకట్టారు. దీంతో చేపలకు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఎక్కువ రేటు వున్నాకూడా వినియోగదారుడు చేపలు కొనడానికి వెనుకంజ వేయలేదు. అయితే అది నిన్నటి మాట. రంగారెడ్డిజిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో నిర్వాహకులు చేపలను వృధాగా పడేయడం కలకలం రేపుతోంది. గంగపుత్ర సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే చేప…