Moinabad Farm House Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామ సమీపంలోని చెర్రీ అండ్ ఓక్స్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు మాత్రం పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లలను పోషించే శక్తిలేక బాల్యంలోనే పెళ్లిళ్లు చేయడానికి సిద్ధపడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆస్తులను ఆశగా చూపి తమ కంటే 20 ఏళ్లు తక్కువ వయసున్న బాలికలను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు కొందరు వ్యక్తులు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. షాద్ నగర్ నందిగామలో బాల్య వివాహం చేసుకున్న వ్యక్తిపై…
Operation Karag : రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, వేములనర్వ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పన్నెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ గ్రామ యువతి విజయలక్ష్మి అలియాస్ భూమిక, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ కగార్’లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వార్తలు రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయలక్ష్మి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఆమె ఉద్యమాలకు ఆకర్షితురాలై, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి దూరంగా, ఒక ఆశయంతో పయనించిన ఆమె జీవితం ఇలా…
తమలో ఒకరికి మంత్రి పదవి కావాలంటూ ఆ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారా? పార్టీ పెద్దలకు ప్రేమలేఖ రాయబోతున్నారా? ముందంతా అభిప్రాయాలు పంచేసుకుని… తమలో తామే మాట్లాడేసుకున్న ఎమ్మెల్యేలు తీరా లేఖ మీద సంతకం చేయాల్సి వచ్చేసరికి వెనక్కి తగ్గుతున్నారా? ఇంతకీ వాళ్ళకి పదవి కావాల్నా? వద్దా? ఎవరా నలుగురు? ఏంటా కథ? తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు టైం దగ్గరపడుతున్న కొద్దీ….ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలో అయితే… రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో…
Former MLA Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మోకిలలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి విచారణకు హాజరు అయ్యారు.
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాలలో ఈ నెల (మార్చ్) 3వ తేదీన జరిగిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు చేధించారు.
Fire Accident : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్ వే పై ఒక కారు లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. అత్తాపూర్ 151 పిల్లర్ నెంబర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టాటా క్వాలీస్ కారు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కిందకు దిగిపోయాడు. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు. క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి…
సమ్మర్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు ఈత కోసం స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్తుంటారు. ఈత నేర్చుకోవడం కోసం కొందరు, ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు మరికొందరు స్విమ్మింగ్ పూల్ కు వెళ్తుంటారు. అయితే ఇటీవల స్విమ్మింగ్ కోసం వెళ్లిన వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మీర్పేట్ పరిధిలో ఈత కోసం స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిన హసన్ అనే వ్యక్తి ప్రాణాలు…
రంగారెడ్డి జిల్లా టంగుటూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో శంభారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం టంగుటూరులో లొకేషన్ చూపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం కావడంతో శంబారెడ్డి స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై విచారణ కొనసాగుతుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్నారు. దుండగులు కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టు గుర్తించారు.. ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.