Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రపరిశ్రమలో డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇరువర్గాలు మెగాస్టార్ చిరుతో భేటీ అనంతరం తామంతా ఒకటేనని గ్రూపులు లేవని వెల్లడించాయి. కానీ వివాదం సమసిపోలేదు. దాంతో ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిలిం ఫెడరేషన్) రంగంలోకి దిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది.
గత కొన్ని రోజులుగా డ్యాన్సర్స్ అసోసియేషన్లో అంతర్గత విభేదాలు, వరుస రాజీనామాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న తీవ్ర ఆరోపణల వల్ల వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్లో చోటు చేసుకున్న క్రమశిక్షణా ఉల్లంఘనలపై ఫెడరేషన్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డ్యాన్సర్స్ అసోసియేషన్ కమిటీ భవిష్యత్తు మరియు దాని మనుగడపై ఈ సమావేశంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ డ్యాన్సర్ల సమస్యలకు, ఈ గొడవలకు ఒక ఫుల్స్టాప్ పెట్టాలని ఫెడరేషన్ భావిస్తోంది. ఇరు వర్గాల వాదనలను, ఆరోపణలను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత, ఫెడరేషన్ పెద్దలు తమ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ అత్యవసర సమావేశం ముగిసిన వెంటనే మీడియా ముఖంగా అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ మీటింగ్తో డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి శుభం కార్డు పడుతుందో లేదో చూడాలి.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!