Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashada Bonalu: తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ వేడుకలు గోల్కొండ కోటపై కొలువై ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమై, నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా కొనసాగనున్నాయి.
అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం, ఆదివారం రోజుల్లో గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు గోల్కొండకు చేరుకుంటున్నారు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
బోనాల ప్రారంభోత్సవంలో భాగంగా నేడు లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ పోతురాజుల విన్యాసాలు, జానపద కళారూపాలతో ఈ శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనంతరం కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరుల వర్గానికి చెందిన భక్తులు తొలి బోనాన్ని సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్‌లో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు.
బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు నిర్వహించనుండగా.. అనంతరం మంగళవారం కళ్యాణోత్సవం జరుగుతుంది. మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరిగా నాలుగో ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారితో ఆషాఢ బోనాల వేడుకలు ముగియనున్నాయి.
బోనాల సందర్భంగా అన్ని ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. భద్రత దృష్ట్యా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!