Konda Surekha: వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేలా సీఎం కార్యాచరణ..
- రేపు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- టెక్స్ టైల్ పార్క్.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించనున్న సీఎం..
- వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాం: మంత్రి కొండా సురేఖ
Konda Surekha: రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో జిల్లా మంత్రి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం టూర్ వేళ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నారు.. సీఎం టూర్ పై ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో రివ్యూ చేశాము.. మధ్యాహ్నం 1 వరకు టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుని పరిశీలిస్తారు.. ఆ తరువాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించి అధికారుల దగ్గర నుంచి వివరాలు తెలుసుకుంటారు.. అనంతరం హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ ఉంటుంది అని తెలిపారు. ఇక, రెండో రాజధానిగా చేసే లక్ష్యంగా అభివృద్ధి చేసేలా సీఎం కార్యాచరణ ఉంది.. మాస్టర్ ప్లాన్ అంశం చర్చకు వస్తాయి.. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సొంత ఎజెండాతో చేసింది అని అర్థం అయ్యింది.. దాన్ని మార్చాల్సి ఉంది అని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
Read Also: T20 World Cup 2024: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆఫ్ఘాన్ ఆటగాడు..
Also Read
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
- Warangal Rocket Launch : తొలిసారి ఓరుగల్లు గడ్డపై రాకెట్ ప్రయోగం.! ఆకాశంలోకి దూసుకెళ్లనున్న 'రుద్రమ' రాకెట్..
ఇక, మూడు నెలల కాలవ్యవధి పెట్టి మాస్టర్ ప్లాన్ తయారీ చేసే అంశం ఉంటుంది అని మంత్రి సురేఖ అన్నారు. స్మార్ట్ సిటి పనుల అంశంపై చర్చించే అవకాశం ఉంది.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశం చర్చిస్తాం.. అలాగే కేబుల్ కూడా అండర్ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేస్తారు.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం.. దాని సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాము.. ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల దూరం మాత్రమే చేశారు.. ఈ అంశం చర్చకు వస్తుంది.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నీ అతి త్వరలో స్వాధీనం చేసుకొని రోగుల అందుబాటులో తెచ్చే అంశంపై చర్చిస్తాం.. ఈ హాస్పిటల్ కేవలం 12 అంతస్తులు మాత్రమే రోగులకు వాడాలి.. దీన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశాన్ని చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం.. మమూనూర్ ఎయిర్ పోర్ట్ అంశం కూడా చర్చకు వస్తుంది.. సీఎం దృష్టి తీసుకెళ్ళి ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగుతుంది.. రూ. 20 కోట్ల లోన్ రేపు మహిళ శక్తి రుణాల ఇస్తారు.. కాళోజీ కళ కేత్రం పనుల ఆలస్యం పైనా చర్చిస్తాం.. వరంగల్ కార్పొరేషన్ కి కొత్త బిల్డింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు చర్చకు వస్తాయని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!