ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- హన్మకొండలో ఏసీబీ సర్ప్రైజ్ దాడులు
- ఇళ్లు, ప్లాట్లు, నగదుతో భారీ ఆస్తుల గుర్తింపు
- ఇంట్లో లగ్జరీ కారు, బంగారం, వెండి స్వాధీనం
- రూ.30 కోట్ల అక్రమాస్తులపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids : అక్రమార్జనతో కోట్లు కూడబెట్టిన మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు. హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్-II గా పనిచేస్తూ, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న దేవులూరి ఆనంద్ ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం (మే 20, 2026) సర్ప్రైజ్ చెక్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆనంద్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో సదరు అధికారికి ఏకంగా రూ. 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించడం సంచలనంగా మారింది.
ఈ ఏసీబీ సోదాల్లో భారీగా స్థిరాస్తులు, నగదు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. డాక్యుమెంట్ల ప్రకారం సుమారు రూ. 71,56,708 విలువైన రెండు లగ్జరీ నివాస గృహాలు, అలాగే రూ. 28,37,000 విలువైన ఆరు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి ప్రస్తుత ఓపెన్ మార్కెట్ విలువ అధికారిక ప్రభుత్వ అంచనాల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది.
Also Read
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
స్థిరాస్తులతో పాటు ఇళ్లలో దాచిన రూ. 24,50,450 లిక్విడ్ క్యాష్, రూ. 7,05,367 బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే రూ. 6,07,700 విలువైన హోమ్ అప్లయన్సెస్ (గృహోపకరణాలు) కనుగొన్నారు. వీటితో పాటు రూ. 13,25,000 విలువ చేసే ఒక లగ్జరీ కారు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా సదరు సస్పెండెడ్ అధికారి ఇంట్లో ఏకంగా 819.5 గ్రాముల బంగారం, 2264.5 గ్రాముల వెండి వస్తువులు లభించాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 43,16,930 గా అధికారులు లెక్కగట్టారు. ప్రస్తుతం ఈ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసి, దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
తాజావార్తలు
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
AP News: నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
-
India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..