GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- గ్రేటర్ వరంగల్ పాలనలో గందరగోళం
- ఒకే అధికారికి మూడు కీలక బాధ్యతలు
- కమిషనర్ నియామకంపై రాజకీయ అనుమానాలు
- అభివృద్ధి పనులపై ప్రభావం.. ప్రజల్లో అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన గ్రేటర్ వరంగల్ (GWMC) పాలన ప్రస్తుతం గందరగోళంగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినప్పటికీ, వరంగల్ మున్సిపల్ కమిషనర్ పోస్టును మాత్రం భర్తీ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు నగరం వేగంగా విస్తరిస్తున్నా, పూర్తిస్థాయి బాస్ లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.
ప్రస్తుతం హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా ఉన్న షాహత్ బాజ్‌పాయి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) వైస్ చైర్ పర్సన్ బాధ్యతలను కూడా ఆమెకే అప్పగించారు. ఇలా ఒకే అధికారి మూడు కీలకమైన పోస్టులను పర్యవేక్షించాల్సి రావడంతో పాలనపై పట్టు తప్పుతోందని, ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి.
Also Read
ఇంతటి కీలకమైన పోస్టును ఖాళీగా ఉంచడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారుల బదిలీల జాబితాలో వరంగల్‌కు కమిషనర్ వస్తారని అందరూ ఆశించినా, ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. జిల్లాలో కీలక పోస్టులో ఉన్న ఒక అధికారికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాల కారణంగానే ఈ నియామకం వాయిదా పడుతోందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
సుమారు 11 లక్షల జనాభా కలిగిన వరంగల్ వంటి నగరానికి నిరంతరం పర్యవేక్షణ చేసే పూర్తిస్థాయి కమిషనర్ అవసరం ఎంతైనా ఉంది. ఇంచార్జీల పాలన వల్ల పర్యవేక్షణ లోపించి నగరంలో మౌలిక వసతుల కల్పన మందగించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఓరుగల్లు బల్దియాకు పూర్తిస్థాయి బాస్‌ను ఎప్పుడు నియమిస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!