Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harshad Chopra: ప్రేమకు జీవితాన్ని అందంగా మార్చే శక్తి ఉంటే, అదే ప్రేమలో ఎదురయ్యే ద్రోహం కూడా మనిషిని పూర్తిగా మార్చేయగలదు. కాలం గడిచినా కొన్ని గాయాలు మానవు. కొన్ని జ్ఞాపకాలు మనసును వదిలిపోవు. ప్రముఖ టెలివిజన్ నటుడు హర్షద్ చోప్రా జీవితంలో కూడా అలాంటి ఓ చేదు అనుభవం మిగిలిపోయిందని ఆయన వెల్లడించారు. 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నకు ‘లాకప్ సీజన్ 2’ రియాలిటీ షోలో ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షోలో తనని మరో పోటీదారు శ్రేయా కల్రా పెళ్లి గురించి ప్రశ్నించగా, ఒకప్పుడు తన జీవితాన్ని పంచుకోవాలనుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చారని, అయితే తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని హర్షద్ తెలిపారు. ప్రేమలో నమ్మకం దెబ్బతిన్న తర్వాత మరోసారి అదే బంధంలోకి అడుగుపెట్టేందుకు తన మనసు సిద్ధంగా లేదని చెప్పారు. ప్రస్తుతం ఒంటరిగా జీవించడంలోనే తనకు ప్రశాంతత దొరికిందని ఆయన వెల్లడించారు.
‘లాకప్ సీజన్ 2’ ప్రీమియర్ ఎపిసోడ్లో హర్షద్ తన వ్యక్తిగత జీవితంలోని బాధాకరమైన సంఘటనను పంచుకున్నారు. 2010లో తన మాజీ ప్రేయసి, తన ప్రాణ మిత్రుడితో కలిసి తనను మోసం చేశారని చెప్పారు. ఆ ఘటనతో ఒకేసారి ప్రేమించిన వ్యక్తిని, ప్రాణ స్నేహితుడిని కోల్పోయానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటన తర్వాతే తన పర్సనల్ జీవితాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 16 ఏళ్లు గడిచినా ఆ మోసం మరవలేకున్నా ఉండానని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోరనే విమర్శలు గతంలో చాలాసార్లు ఎదురైనా, వాటి వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇప్పుడు హర్షద్ వివరించారు. ఆ సంఘటన తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, అందుకే వ్యక్తిగత జీవితాన్ని అందరికీ దూరంగా ఉంచుతున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ స్పందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!