Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
- వదులైన రబ్బర్కు ఐస్, ఫ్రీజర్ సూపర్ ట్రిక్
- పిండి ముద్దతో తాత్కాలికంగా లీకేజీకి చెక్
- నూనె లేదా నెయ్యితో సీలింగ్ మరింత బెటర్
- ఈ జాగ్రత్తలు పాటిస్తే రబ్బర్ ఎక్కువ రోజులు మన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips : ప్రస్తుత రోజుల్లో వంట చేయడం చాలా సులభంగా, వేగంగా మారిపోయింది. మునుపటిలా వంట పాత్రలు కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇప్పుడు నాణ్యమైన అల్యూమినియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్లు విరివిగా దర్శనమిస్తున్నాయి. ఇతర వంట పద్ధతులతో పోలిస్తే కుక్కర్లో వండటం వల్ల సమయం కలిసిరావడమే కాకుండా ఆరోగ్యం కూడా. అయితే, కొన్నిసార్లు పప్పు లేదా కూరగాయలు ఉడికించడానికి స్టవ్ మీద పెట్టి కుక్కర్ మూత పెట్టగానే.. విజిల్ రాకుండా ఆవిరి లేదా లోపలి నీరు అకస్మాత్తుగా పక్కల నుండి లీక్ అవ్వడం మొదలవుతుంది. దీనివల్ల ప్రెషర్ పెరగక వంట అవ్వడానికి చాలా సమయం పడుతుంది.
కుక్కర్ నిరంతర వాడకం , లోపలి వేడి ఆవిరి కారణంగా కాలక్రమేణా దాని రబ్బరు (గాస్కెట్) వదులుగా మారిపోవడం లేదా అరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాంటప్పుడు వెంటనే కొత్త రబ్బరు కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే దాన్ని తిరిగి బిగుతుగా మార్చుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
Also Read
చల్లటి మంచు (ఐస్) పద్ధతి
రబ్బరు పదేపదే వేడికి గురైనప్పుడు అది వ్యాకోచించి (సాగిపోయి) తన పట్టును కోల్పోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రబ్బరును కుక్కర్ మూత నుండి వేరు చేయండి. ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీటిని తీసుకుని అందులో కొన్ని ఐస్ ముక్కలు (మంచు గడ్డలు) వేయండి. ఇప్పుడు ఆ చల్లటి ఐస్ నీళ్లలో ఈ రబ్బరును 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టండి. చల్లటి ఉష్ణోగ్రత వల్ల సాగిపోయిన రబ్బరు మళ్లీ సంకోచించి, బిగుతుగా మారుతుంది.
ఫ్రీజర్ ట్రిక్
మీ ఇంట్లో ఐస్ ముక్కలు వెంటనే అందుబాటులో లేకపోతే ఫ్రీజర్ను ఉపయోగించవచ్చు. ముందుగా వదులైన రబ్బరును నీళ్లతో క్షుణ్ణంగా శుభ్రం చేసి తడి లేకుండా ఆరబెట్టండి. ఆ తర్వాత ఆ రబ్బరును నేరుగా రిఫ్రిజిరేటర్ ఫ్రీజర్లో 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచండి. ఫ్రీజర్ నుండి బయటకు తీసిన వెంటనే దాన్ని కుక్కర్ మూతకు అమర్చితే, చల్లదనం వల్ల గట్టిపడిన రబ్బరు కుక్కర్పై పట్టును తిరిగి పొందుతుంది.
పిండి ముద్దతో సీలింగ్ ఐడియా
వంట అత్యవసరంగా అవ్వాల్సిన సమయంలో గ్యాస్ లీకేజీని ఆపడానికి ఇది ఒక చక్కని తాత్కాలిక పరిష్కారం. మనం చపాతీకి వాడే కొద్దిగా పిసికిన గోధుమ పిండి ముద్దను తీసుకుని, కుక్కర్ మూత చుట్టూ ఆవిరి బయటకు వస్తున్న ప్రదేశంలో పలుచని పొరలా అంటించండి. ఈ పిండి ముద్ద లీకేజీని తాత్కాలికంగా అడ్డుకుని, ప్రెషర్ పెరగడానికి సహాయపడుతుంది. అయితే, ఈ పిండిని పెట్టేటప్పుడు విజిల్ వచ్చే రంధ్రాన్ని (వెయిట్ వాల్వ్) మాత్రం అస్సలు కప్పకుండా జాగ్రత్త వహించాలి.
కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయడం
కొన్నిసార్లు రబ్బరు పొడిబారడం (Dryness) వల్ల కూడా మూత అంచులకు సరిగ్గా అంటుకోదు. అటువంటప్పుడు గోరువెచ్చని నీరు, డిష్ వాషింగ్ సోప్ ఉపయోగించి కుక్కర్ మూతను, పాత్ర అంచులను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మీ వేళ్లకు కొద్దిగా వంట నూనె లేదా నెయ్యి రాసుకుని, దాన్ని రబ్బరు చుట్టూ పలుచని పొరలా పూయాలి. ఇలా చేయడం వల్ల రబ్బరుకు జిగురు పట్టు పెరిగి, ఆవిరి లీకేజీ సమస్య త్వరగా తగ్గుతుంది.
రబ్బరు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే..
వారానికి ఒకసారి ఫ్రిజ్లో పెట్టండి: రబ్బరు యొక్క సాగే గుణం దెబ్బతినకుండా ఉండాలంటే వారానికి కనీసం ఒక్కసారైనా దాన్ని కాసేపు ఫ్రిజ్లో ఉంచాలి.
మూతను బోర్లించి పెట్టండి: వంట పూర్తయి కుక్కర్ కడిగిన తర్వాత, మూతను ఎప్పుడూ కుక్కర్పై తిరగేసి (బోర్లించి) పెట్టాలి. దీనివల్ల రబ్బరుపై అనవసర ఒత్తిడి పడదు.
వెంటనే కడగాలి: ఆహారపు రేణువులు లేదా జిడ్డు రబ్బరు అంచులకు అంటుకుంటే అది త్వరగా పాడవుతుంది. కాబట్టి వంట కాగానే రబ్బరును విడిగా తీసి చల్లటి నీటితో, అంచులను తడి గుడ్డతో శుభ్రం చేయాలి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!