T20 World Cup 2024: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆఫ్ఘాన్ ఆటగాడు..
- వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆఫ్ఘాన్ ఆటగాడు ఫజల్‌హక్ ఫరూఖీ
- టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్
- 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన ఫరూఖీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అఫ్గానిస్థాన్ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఫజల్‌హక్ ఫరూఖీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ వికెట్ తీసి రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫరూఖీ 2 ఓవర్లలో 11 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఫరూకీకి ఇది 17వ వికెట్.
టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఫజల్‌హక్ ఫరూఖీ నిలిచాడు. ఫరూఖీ 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో 16 వికెట్లు తీసిన శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా రికార్డును బద్దలు కొట్టాడు. 2012 టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసిన శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
Emergency: ‘‘ఎమర్జెన్సీ’’పై రాష్ట్రపతి, స్పీకర్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నిరసన..
టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
17* – ఫజల్హాక్ ఫరూకీ (ఆఫ్ఘనిస్తాన్)
16 – వనిందు హసరంగా (శ్రీలంక)
15 – అజంతా మెండిస్ (శ్రీలంక)
15 – వనిందు హసరంగా (శ్రీలంక)
15 – అర్ష్‌దీప్ సింగ్ (ఇండియా)
భారత బౌలర్‌కి సువర్ణావకాశం
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఫజల్‌హాక్ ఫరూఖీ రికార్డును బ్రేక్ చేసే అవకాశమిచ్చింది. మరికొన్ని గంటల్లో ఈ రికార్డు బద్దలు కానుంది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 15 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీస్తే.. ఫరూఖీని వెనక్కి నెట్టి ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.
2024 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
17 – ఫజల్హాక్ ఫరూకీ (ఆఫ్ఘనిస్తాన్)
15 – అర్ష్‌దీప్ సింగ్ (భారతదేశం)
14 – రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్)
14 – రిషద్ హుస్సేన్ (బంగ్లాదేశ్)
13 – నవీన్ ఉల్ హక్ (ఆఫ్ఘనిస్తాన్)
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..