RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు తొలి పాట ఇరుముడి కట్టుతో అద్భుతంగా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు లభించిన అద్భుత స్పందన, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ అద్భుతమైన ఫామ్ తో ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
‘ఇరుముడి కట్టు’ ఒక ఆధ్యాత్మిక భావోద్వేగాలతో కూడిన భక్తి పాట. జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటలో అయ్యప్ప స్వామి భక్తి, నియమ నిష్ఠలు, మండల దీక్ష పవిత్రతను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ స్వరకల్పన పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన భక్తి పారవశ్యాన్ని కలిగించింది. ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తితో కలిసి సాహిత్యం అందించారు. అయ్యప్ప మాల ధరించి మండల దీక్ష చేపట్టిన ఓ భక్తుడు ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర చేసే పవిత్ర ప్రయాణాన్ని ఈ సాహిత్యం ఎంతో హృద్యంగా కనిపించింది. అయ్యప్ప మాల ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత, నియమశిక్షణ, జీవిత సారాన్ని హీరో కోణంలో అద్భుతంగా చూపించారు. అనంతు పవర్ ఫుల్ వోకల్స్ ప్రతి పదానికి భక్తి భావాన్ని జోడించి పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.రవితేజ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తుడి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన లుక్, భక్తి భావం, హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాబా భాస్కర్ కోరియోగ్రఫీ పాటలోని ఆధ్యాత్మికతను మరింత గొప్పగా ఆవిష్కరించింది. ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కనిపించే భావోద్వేగ సన్నివేశాలు కథకు మరింత ఎమోషన్ ని జోడించాయి. ‘ఇరుముడి కట్టు’ మనసును తాకే భక్తి గీతంగా నిలుస్తూ ‘ఇరుముడి’ సినిమా అందించబోయే ఎమోషనల్ జర్నీకి అద్భుతమైన ఆరంభాన్ని అందించింది. ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
ట్రెండింగ్
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..