Vikarabad: వికారాబాద్ జిల్లా పెద్దెముల్ లో దారుణం చోటు చేసుకుంది. పెద్దెముల్- మారేపల్లి మార్గ మధ్యంలోని పెద్ద కాల్వలో ఓ మహిళా మృతదేహం లభ్యమైంది. అయితే, మహిళ మొహాన్ని దుండగులు తగలబెట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇక, మహిళను గుర్తు పట్టకుండా ఉండాలనే మొహం కాల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Ghibli: మోడీ, నెతన్యాహూ “ఘిబ్లీ” ఇమేజ్ వైరల్.. షేర్ చేసిన ఇజ్రాయిల్..
అయితే, మహిళా మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు కిలోమీటర్ దూరంలో ఉన్న ఫాంహౌస్ దగ్గరకు పోలీస్ జాగిలాలు చేరుకున్నాయి. ఇక, ఫాంహౌస్ లో దాదాపు 30 మంది మహారాష్ట్ర కూలీలు పని చేస్తున్నారు. దీంతో వారిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, మృతురాలి చేతిపై యశోదా అనే పేరుతో పచ్చబొట్టు ఉంది.. దీంతో పాటు ఘటన స్థలంలో మద్యం, వాటర్ బాటిల్ గుర్తించాం. చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా మహిళా మిస్సింగ్ అయిందన్న కోణంలో విచారణ చేస్తున్నాం.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అత్యాచారం జరిగిందా లేదా అనే వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు.