వర్షం దాటికి రెండు వేర్వేరు గ్రామాలలోని పాఠశాలల్లో ఆ భవనాలకు సంబంధించి పెచ్చులు ఓవైపు, వర్షపునీరు మరోవైపు.. కిందపడుతోంది.. పెచ్చులు ఊడుతుండడంతో ఆ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి.. భయంతో స్కూల్‌కు రావాలంటేనే విద్యార్థులు వణికిపోతుంటూ.. ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీర్ల కొట్టానికి (ముస్లింలు పీర్లను పెట్టే ప్రదేశం) సంబంధించిన రేకుల షెడ్డులో పాటలు చెబుతుంటే.. మరో గ్రామంలో గణేష్ మండపంలో పాటలు చెబుతున్నాడు ఉపాధ్యాయులు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడు గ్రామాలలో భూకంపం సంభవించింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని ఇంట్లో ఉన్న సామాన్లు కిందపడినట్లు వెల్లడించారు. భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు. ఓ వైపు వర్షాలతో బెంబేలెత్తుతుంటే మరోవైపు భూ ప్రకంపనలు వికారబాద్ జిల్లాలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు హత మార్చారు. అర్ధరాత్రి సమయంలో వినోద అనే వృద్ధురాలిని చంపేసి.. ఆమె ఇంట్లోనే ఉన్న బావిలో పడేశారు.
Telangana Government: వికారాబాద్ జిల్లా లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా గ్రామాల్లో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.
అమ్మ అనంత ఆప్యాయతా సాగరం. తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం. ఆమె లేకుంటే జన్మ లేదు. జీవితానికి వెలుగే లేదు. మాతృత్వం కోసం ఎన్నో కష్టాలు సహించి బిడ్డల్ని ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది. అందుకే మాతృమూర్తిని మించిన దైవం లేదనేది జగమెరిగిన సత్యం. అంతలా తన పిల్లల కోసం ఆరాటపడుతుంది. కానీ నేటి కాలంలో నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లలు ఇవేమి పట్టించుకోకుండా మాతృమూర్తులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అవసరమైతే వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాడటం…
తాజాగా లగచర్ల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి ఘటనలో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ నేత సురేష్‌కు అసలు భూమి లేదని వికారాబాద్ కలెక్టర్ తేల్చిచెప్పారు.
దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు.