Vijayashanthi: కేసీఆర్‌వి పగటి కలలే.. కేంద్రంలో మేమే.. తెలంగాణలో వచ్చేది మా సర్కారే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని పదవి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలే.. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యం అన్నారు.. ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదు.. గార్బేజ్ హైదరాబాద్ లా ఉందని మండిపడ్డారు.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తమయం, కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ ను సర్వనాశనం చేశారన్న ఆమె.. హైదరాబాద్ సందుల్లో ఎక్కడ చూసినా… కచరానే దర్శనమిస్తోంది.. వర్షాలు వస్తే మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి.. దోమల నిర్మూలనకు మందు కూడ కొట్టడం లేదని ఆరోపణలు గుప్పించారు.
Read Also: Etela Rajender: కేసీఆర్‌ను సభకు రాకుండా చేసే బాధ్యత నాదే.. ఈ ప్రభుత్వం ఫీజు పీకాల్సిందే..!
Also Read
- NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు విజయశాంతి… రోడ్లు, డ్రైనేజీ, నాలాల పరిస్థితి అద్వాన్నంగా ఉందన్న ఆమె.. కేసీఆర్ పాలన అతి నీచంగా ఉందంటూ ఫైర్ అయ్యారు.. కేసీఆర్ ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించని కారణంగా, పేదలు వైద్యానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ అమలు చేయడం లేదు.. తెలంగాణను సర్వనాశనం చేసి దోచుకు తింటున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతులను ఆదుకోని కేసీఆర్.. పక్క రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సొమ్మును పంచుతున్నారని విమర్శించారు.. నీలాంటి నీచుడితో ఉద్యమంలో పాల్గొన్నందుకు సిగ్గుతో లెంపలేసుకుంటున్నానని వ్యాఖ్యానించిన ఆమె… ఎంఐఎంతో కలిసి కేసీఆర్ హిందూ సమాజాన్ని తిట్టిస్తున్నాడని ఫైర్ అయ్యారు.. కేసీఆర్, నితీష్ కుమార్ లాంటి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా… నరేంద్ర మోడీని ఏమీ చేయలేరు.. ప్రధాని పదవి విషయంలో కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలేనని.. ప్రధాని అంటేనే బాగ్ మిల్కా బాగ్ లా పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి..
తాజావార్తలు
-
Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
-
Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
-
Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!