Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak: మెదక్ జిల్లాలో ఓ నకిలీ బాబా మోసం వెలుగులోకి వచ్చింది. తూప్రాన్ మండలం గుండ్రేడ్డిపల్లి గ్రామంలో ఓ యువతిని మాయమాటలతో నమ్మించి వివాహం చేసుకున్న వ్యక్తి, ఆ తర్వాత గుప్తనిధుల పేరుతో లక్షల రూపాయలు కాజేసిన ఘటన సంచలనం రేపుతోంది. విషయం బయటపడడంతో గ్రామస్తులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. మస్తాన్ అనే వ్యక్తి తనను తాను బాబాగా పరిచయం చేసుకుంటూ, ఓ యువతిని నమ్మించాడు. “నన్ను పెళ్లి చేసుకుంటే నీ జన్మ సార్థకం అవుతుంది” అంటూ మాయమాటలు చెప్పి ఆమెను, కుటుంబ సభ్యులను నమ్మించి వివాహం చేసుకున్నాడు కేటుగాడు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి.. తవ్వకాలు చేయాలంటూ బాధిత కుటుంబం నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. గుప్తనిధులు బయటపడతాయని చెప్పి పలుమార్లు తవ్వకాలు కూడా నిర్వహించాడు. అయితే ఈ వ్యవహారం గ్రామంలో బయటపడడంతో మస్తాన్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కొంతకాలం తర్వాత తిరిగి గ్రామానికి రావడంతో అప్రమత్తమైన గ్రామస్తులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మస్తాన్‌కు ఇప్పటికే రెండు వివాహాలు జరిగినట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!