Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
- ఉప్పు, పంచదార గట్టిపడటానికి కారణం ఇదే
- బియ్యం, కాఫీ గింజలతో తేమకు చెక్
- లవంగం, రాజ్మాతో సూపర్ టిప్స్
- ఎయిర్‌టైట్ డబ్బా.. పొడి చెంచా తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainy Season Tips : వర్షాకాలం హాయిగా అనిపించినప్పటికీ, వంటగదిలో మాత్రం అనేక సవాళ్లను మోసుకొస్తుంది. పెరిగే తేమ వల్ల బొద్దింకలు, దోమల బెడద ఎక్కువవడం, ఆహార పదార్థాలపై బూజు పట్టడం, కూరగాయలు త్వరగా కుళ్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిలో ప్రతి ఇంట్లోనూ నిత్యం కనిపించే ప్రధాన సమస్య రోజువారీ వంటల్లో వాడే ఉప్పు, పంచదార తడిసిపోయి గట్టి ముద్దలుగా మారడం. చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
వర్షాకాలంలో ఉప్పు అంత త్వరగా ఎందుకు గట్టిపడుతుంది?
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం (Humidity) గణనీయంగా పెరుగుతుంది. ఉప్పులో మెగ్నీషియం క్లోరైడ్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి వాతావరణంలోని తేమను త్వరగా గ్రహించే (హైగ్రోస్కోపిక్) స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉప్పు డబ్బాను పదేపదే తెరవడం వల్ల లేదా సరిగ్గా మూత పెట్టకపోవడం వల్ల బయటి తేమ లోపలికి చేరి, ఉప్పు జిగటగా మారి గట్టిపడుతుంది. తడి వాతావరణం ఉన్న చోట డబ్బాలను ఉంచడం కూడా ఈ సమస్యను మరింత పెంచుతుంది.
Also Read
- National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
- Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
- Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
- Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
బియ్యపు గింజలతో సులభమైన పరిష్కారం
ఉప్పు, పంచదారలను పొడిగా ఉంచడానికి బియ్యపు గింజలను ఉపయోగించడం అత్యంత పురాతనమైన, ప్రభావవంతమైన పద్ధతి. బియ్యానికి గాలిలోని అదనపు తేమను వేగంగా పీల్చుకునే గుణం ఉంటుంది. చిన్న ఉప్పు పాత్రలలో కొన్ని బియ్యపు గింజలను నేరుగా వేయవచ్చు. ఒకవేళ పెద్ద డబ్బా అయితే బియ్యాన్ని ఒక చిన్న కాటన్ గుడ్డలో లేదా కాగితపు సంచిలో మూటకట్టి డబ్బాలో ఉంచడం మంచిది. దీనివల్ల ఉప్పు ఎక్కువ కాలం పొడిగా ఉంటుంది.
కాఫీ గింజలు , రాజ్మా గింజల వాడకం
మీ ఇంట్లో కాఫీ గింజలు అందుబాటులో ఉంటే వాటిని ఉప్పు లేదా చక్కెర పాత్రల్లో వేయవచ్చు. కాఫీ గింజలు వాతావరణంలోని తేమను సులభంగా పీల్చుకుంటాయి , వీటివల్ల ఉప్పు లేదా చక్కెర రుచిలో ఎలాంటి మార్పు రాదు. అలాగే ఎండిన రాజ్మా (కిడ్నీ బీన్స్) గింజలు కూడా తేమను పీల్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వర్షాకాలంలో కొన్ని రాజ్మా గింజలను ఉప్పు డబ్బాల్లో ఉంచడం వల్ల ముద్దలు కట్టకుండా నిరోధించవచ్చు.
లవంగాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు
తేమను తగ్గించడంలో లవంగాలు కూడా ఎంతో సహాయపడతాయి. అయితే లవంగాలకు ఉండే ఘాటైన సువాసన ఉప్పు లేదా చక్కెర రుచిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల లవంగాలను నేరుగా వేయకుండా, ఒక శుభ్రమైన చిన్న గుడ్డ ముక్కలో చుట్టి ఆ మూటను డబ్బాలో ఉంచడం ఉత్తమం. ఇది ఆహార పదార్థాల రుచి మారకుండా తేమను సమర్థవంతంగా గ్రహిస్తుంది.
గాలి చొరబడని పాత్రలు.. పొడి చెంచా వాడకం
ఉప్పును ఎల్లప్పుడూ మంచి నాణ్యత కలిగిన, గాలి చొరబడని (Air-tight) డబ్బాల్లో మాత్రమే నిల్వ చేయాలి. ఉపయోగించిన వెంటనే మూతను గట్టిగా పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఉప్పు లేదా పంచదారను తీయడానికి ఎల్లప్పుడూ పూర్తిగా పొడిగా ఉన్న చెంచాలనే వాడాలి. స్వల్పంగా తడి ఉన్న చెంచాను ఉపయోగించినా డబ్బాలోని పదార్థం మొత్తం త్వరగా మెత్తబడి ముద్దగా మారే ప్రమాదం ఉంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలం అంతా వంటగదిలోని పదార్థాలను పొడిగా, సురక్షితంగా ఉంచుకోవచ్చు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Clothes Washing Tips: బట్టలు ఉతకడానికి ముందు ఎంతసేపు నానబెట్టాలి? ఈ తప్పు చేస్తే మీ బట్టలు పాడైపోవడం ఖాయం!
-
HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!