బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది… తాజా పరిణామాలపై ఫైర్ అయ్యారు ఈటల… నన్ను సభకు రానియొద్దని అయన అనుకున్నట్టునాడు.. కానీ, కేసీఆర్‌ని సభకు రాకుండా చేసే బాధ్యత నాది అని నేను చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు.. కేసీఆర్ ది శంకిని తనం అని మండిపడ్డ ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంకా ఎన్ని రోజులు ఈ మీటర్ల గురించి మాట్లాడుతారని ప్రశ్నించిన ఈటల రాజేందర్.. దుబ్బాకలో గెలిస్తే మీటర్లు పెడతారని ప్రచారం చేశారు.. హుజురాబాద్ లో బీజేపీ గెలిస్తే విద్యుత్ మోటర్లకు మీటర్లు వస్తాయని అన్నారు.. మోటర్లకు మీటర్లు రాలేదు.. కానీ, మనకు కరెంట్ బిల్లుల రూపంలో మీటర్లు పెట్టాడు అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తలకిందులు పెట్టుకున్నా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థియేనని జోస్యం చెప్పారు.. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఫీజు పీకాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
Read Also: GHMC: గ్రేటర్ కొత్త ప్లాన్.. ట్రాన్స్‌ఫార్మర్‌ల ద్వారా ఆదాయంపై గురి..!