Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
- రూపాయి చాక్లెట్‌కు పెరిగిన ఖర్చుల దెబ్బ
- విదేశీ బ్రాండ్లతో గట్టి పోటీ
- మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్లో వెనుకబాటు
- ఆశ చాక్లెట్ పూర్తిగా మాయమైందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asha Chocolate : 90ల్లో పుట్టి పెరిగిన వారికి ‘ఆశ చాక్లెట్’ (Asha Chocolate) పరిచయం అక్కర్లేని పేరు. స్కూల్ బెల్ మోగగానే జేబులో ఉన్న యాభై పైసలో, రూపాయి నోటో పట్టుకుని కిరాణా కొట్టు ముందుకు పరుగెత్తడం.. ఆశ చాక్లెట్ కొనుక్కుని నోట్లో వేసుకుంటే వచ్చే ఆ ఆనందమే వేరు! అప్పట్లో ప్రతీ చిన్నారి చేతిలో అలరించిన ఈ ఐకానిక్ చాక్లెట్, ఇప్పుడు మార్కెట్లో ఎక్కడా సరిగ్గా కనిపించడం లేదు. అసలు అంత పాపులర్ అయిన ఆశ చాక్లెట్ మార్కెట్ నుంచి ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఇవే..
రూపాయి బిజినెస్ మోడల్ ఎదుర్కొన్న దెబ్బ
ఆశ చాక్లెట్ సాధించిన విజయంలో దాని ‘ధర’ అతిపెద్ద పాత్ర పోషించింది. 25 పైసలు, 50 పైసలు, రూపాయి ధరల్లో లభించడం వల్ల సామాన్య పిల్లలకు కూడా ఇది ఎంతో అందుబాటులో ఉండేది. అయితే కాలక్రమేణా చాక్లెట్ తయారీకి కావలసిన ముడిసరుకులైన కోకో, పాలు, చక్కెర , ప్యాకింగ్ కవర్ల ధరలు భారీగా పెరిగాయి. రూపాయి కంటే ధర పెంచితే పిల్లలు కొనరేమోనన్న భయం, ఒకవేళ రూపాయికే అమ్మితే లాభాలు రాకపోగా నష్టాలు వస్తాయన్న సందిగ్ధం వల్ల కంపెనీ ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది.
Also Read
- Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
- Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
- Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
విదేశీ దిగ్గజ బ్రాండ్ల హోరు
మరో ప్రధాన కారణం అంతర్జాతీయ బహుళ జాతీయ (MNC) కంపెనీల దాడి.. కాడ్బరీ, నెస్లే, పర్ఫెట్టి వాన్ మెల్లే (ఆల్పెన్లీబే, సెంటర్ ఫ్రెష్ తయారీదారులు) వంటి దిగ్గజ సంస్థలు భారతీయ మార్కెట్లోకి భారీ స్థాయిలో ప్రవేశించాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు, సరికొత్త ఫ్లేవర్లతో పాటు టీవీల్లో నిరంతరం ప్రకటనలు (Advertisements) గుప్పించి పిల్లల దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. ఈ స్థాయిలో అడ్వర్టైజింగ్ బడ్జెట్ కేటాయించడం స్థానిక చిన్న తరహా బ్రాండ్లకు సాధ్యం కాలేదు.
మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ లోపాలు
కొత్తగా వచ్చిన బ్రాండ్లు తమ ఉత్పత్తులను నగరాల్లోని పెద్ద సూపర్ మార్కెట్ల నుండి పల్లెటూర్లలోని చిన్న బల్ల కొట్టు వరకు సులభంగా చేరవేసే పటిష్టమైన సప్లై చైన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఆశ చాక్లెట్ తయారీదారులు ఆధునిక మార్కెటింగ్ శైలికి మారడంలో వెనుకబడ్డారు. పాతకాలపు పద్ధతులకే పరిమితమవ్వడం వల్ల పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్ల రాకతో ఆశ చాక్లెట్‌కు షెల్ఫ్ స్పేస్ కరువైంది.
నిజంగానే పూర్తిగా మూతపడిందా?
చాలామంది ఆశ చాక్లెట్ మార్కెట్లో కనిపించకపోవడం వెనుక రకరకాల కారణాలు అనుకుంటారు, కానీ అసలు విషయం ఏంటంటే ఈ బ్రాండ్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 2006లో ఆశ చాక్లెట్లను తయారుచేసే ప్రముఖ ‘నూట్రిన్’ (Nutrine) కంపెనీ, గోద్రేజ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్తో సుమారు రూ.260 కోట్లకు విలీనమైంది. అయితే, ఆ తర్వాతి కాలంలో మార్కెట్లో తీవ్రమైన పోటీ, పెరిగిన ఉత్పత్తి వ్యయం వల్ల అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఆశ చాక్లెట్ ప్రొడక్టివిటీని కంపెనీ పూర్తిగా ఆపేసింది. ఏది ఏమైనా, ఆధునిక పోటీ ప్రపంచంలో వ్యాపారం మూతపడినప్పటికీ, 90స్ కిడ్స్ తీపి జ్ఞాపకాలలో ‘ఆశ చాక్లెట్’ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిది..
తాజావార్తలు
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!