ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని.. రాఘవేంద్ర అసైన్డ్, ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశాడని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ ..టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. పాల్వంచ కైనా పోవాలి కదా.. ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత వరకూ ఈ ఘటనపై ఎందుకు మాట్లడలేదంటూ వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు.
Read Also: టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందింది: తమ్మినేని సీతారాం
అసలు పోలీసులు కేసు కూడా నమోదు చేశారా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. వనమా వెంకటేశ్వర రావుతో రాజీనామా చేయిస్తే ప్రజలు హర్షిస్తారని ఆయన అన్నారు. రోజు రోజుకు ఇది గుండా సర్కార్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ కౌన్సిలింగ్ ఎందుకు చేయలేదు? పేదలు, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రం మొత్తం పర్యటిస్తా అని హనుమంతరావు స్పష్టం చేశారు. సంక్రాంతి తరువాత వనామా కబ్జా చేసిన భూముల దగ్గరకు వెళ్తామన్నారు. వాటిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లు ఏం చేస్తున్నాయి? నయీంని మించిన వ్యక్తి వనమా రాఘవ అని వి. హనుమంతరావు తీవ్రంగా విమర్శల దాడులకు దిగారు.