V. Hanumantha Rao: కాంగ్రెస్ కులగణన చేస్తామంటే.. మోడీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. మోడీ ఇండియా కూటమి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని చెపుతున్నారని తెలిపారు. ఇండియా కూటమికి త్రిబుల్ ఫిగర్ రాదు అంటున్న మోడీ.. మరి సంవత్సరానికి ఒక ప్రధాని అవుతారని ఎట్లా అంటున్నారని అన్నారు.
Read also: Smriti Irani: అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన స్మృతి ఇరానీ..
మోడీ లో భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ కులగణన చేస్తామని చెప్పడంతో బీజేపీ దిగజారి మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు మోడీ అయోధ్య కట్టడం తప్ప ..అభివృధి ఎం చేయలేదన్నారు. రిజర్వేషన్ లు , రాజ్యాంగాని తీసేస్తాము అని బీజేపీ అంటుందన్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి న్యాయం జరుగుతుందన్నారు. మోడీ ఆలోచన అంత కార్పొరేట్ స్థాయే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ వస్తే ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తాడని అన్నారు.
Read also: Thummala Nageswara Rao: గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతాం..
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్ లో మేము పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కోహెడ లోని వెంకటేశ్వర గార్డెన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యుడు ఆరుగురు పార్టీ కండువా కప్పుకున్నారు. నాలుగు నెలల తమ పాలనలో 6 గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామన్నారు.
Read also: Ponnam Prabhakar: పదేళ్లలో హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటాం..
కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బండి సంజయ్ పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని సవాల్ చేస్తున్న అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్ లో మేము పోటీ నుంచి తప్పుకుంటామన్నారు. అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుండి తీసేసిన వ్యక్తి ఎంపీగా కొనసాగడానికి వీల్లేదు, ప్రజలు ఆలోచించాలన్నారు. తల్లిని నిందించి మాట్లాడిన క్రమంలో వెదవ అంటే ఆ మాటను వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు అని వక్రీకరిస్తున్నాడని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలన్నారు.
Sanjay Raut : ఇద్దరిని ప్రధానులుగా చేయాలా.. నలుగురిని చేయాలా అన్నది మా ఇష్టం