Ponnam Prabhakar: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్ లో మేము పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా కోహెడ లోని వెంకటేశ్వర గార్డెన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యుడు ఆరుగురు పార్టీ కండువా కప్పుకున్నారు. నాలుగు నెలల తమ పాలనలో 6 గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బండి సంజయ్ పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని సవాల్ చేస్తున్న అన్నారు.
Read also: Sanjay Raut : ఇద్దరిని ప్రధానులుగా చేయాలా.. నలుగురిని చేయాలా అన్నది మా ఇష్టం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్ లో మేము పోటీ నుంచి తప్పుకుంటామన్నారు. అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుండి తీసేసిన వ్యక్తి ఎంపీగా కొనసాగడానికి వీల్లేదు, ప్రజలు ఆలోచించాలన్నారు. తల్లిని నిందించి మాట్లాడిన క్రమంలో వెదవ అంటే ఆ మాటను వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు అని వక్రీకరిస్తున్నాడని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలన్నారు.
Read also: కాళ్ళు తిమ్మిర్లు వచ్చి నొప్పులు పెడుతున్నాయా అయితే..?
కాగా నిన్న (శనివారం) బండి సంజయ్ మాట్లాడుతూ ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నేతలు మాట తప్పారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పింఛను రూ.4 వేలు, ఇల్లు లేని పేదలకు భూమి, రూ.5 లక్షలు, రుణమాఫీ, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు తదితర పథకాలు అమలు చేశారా? నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా వాటిని అమలు చేసినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. అవసరమైతే కాంగ్రెస్ అభ్యర్థికి కూడా ప్రచారం చేస్తానన్నారు. నిరూపించకపోతే 17 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం స్పందించారు.
గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అవకాడో..