ACB : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. శ్రీనివాసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం…
GHMC : హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ నగరంగా మరింత విస్తరింపజేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో, ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఒకే పట్టణ ప్రణాళిక కింద మొత్తం మెట్రో ప్రాంతాన్ని తీసుకువచ్చి, రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వంటి సేవల్లో సమాన స్థాయి అందించడం…
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీకి సర్వం సిద్ధమైంది. మాజీ ప్రధాని ‘ఇందిరా గాంధీ’ జయంతి సందర్భంగా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కోటి మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తోందని ఆయన చెప్పారు. నెక్లెస్ రోడ్డులో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అక్టోబర్ 9వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్‌ఎల్‌పీ పిటిషన్ వేసింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని పిటిషన్‌లో ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీం…
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయని నేపథ్యంలో 2025 దసరా పండగ తర్వాత (అక్టోబర్ 6 నుంచి) విద్యా సంస్థలు తెరవొద్దని కాలేజీ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే విద్యా సంస్థలు బంద్‌పై కాలేజీ యాజమాన్యాలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఇటీవల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్‌కు కాలేజీల…
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వాన ప్రక్రియ (టెండర్లకు ఆహ్వానం) ప్రారంభించింది. డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఆహ్వానించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీ దర్యాప్తుల ఆధారంగా రిహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్ డిజైన్లు చేయనుంది. డిజైన్ల కోసం ఆసక్తి పత్రాలు అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలి. అక్టోబర్ 15 సాయంత్రం 5…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా... నిర్వహణపై నీలి నీడలు మాత్రం తొలిగిపోలేదు. ఎలక్షన్స్ జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి జీవో ఇవ్వడంతోపాటు ప్రాదేశిక నియోజకవర్గంలో కూడా 42 శాతం రిజర్వేషన్ అమలుకు నిర్ణయించింది.