నేడు (డిసెంబర్ 1న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు, ఎన్నికలు జరగనున్న అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) అంశంపై ప్రతిపక్ష నాయకులు తరచుగా అంతరాయం కలిగించారు. గందరగోళం కారణంగా, లోక్‌సభ రోజంతా స్తంభించిపోయింది. సమావేశానికి ముందు, ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకులను సహకరించాలని, ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం సాధించడానికి, సభ సజావుగా…
YS Jagan : రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశాలు జారీ చేశారు. జగన్ మాట్లాడుతూ ‘మొంథా’ తుపాను కోస్తా జిల్లాల్లో భారీ విధ్వంసం సృష్టించిందని, లక్షల ఎకరాల్లో పంటలు నాశనమై…
Pawan Kalyan : అమరావతిలో జనసేన పార్టీకి చెందిన లోకసభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌తో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ ప్రయోజనాలను కేంద్రీకరించిన చర్చల్లో సక్రమంగా పాల్గొనడానికి ముందస్తు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసే…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
జమిలి బిల్లును ప్రవేశ పెడుతూ కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో దీన్ని చేపట్టారు. దీనికి 269 మంది బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనుకూలంగా ఓటు వేయగా.. 198 మంది వ్యతిరేకించారు.
One Nation One Election Bill: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్‌సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్…
రాజ్యాంగంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్మ్యాప్గా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
One Nation One Election: ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభ ఎన్నికల కోసం ఉద్దేశించించబడిన ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’’కి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Rahul Gandhi: శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని ఈ రోజు ( డిసెంబర్ 11) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.