జన చైతన్య ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోడీ నాపై నమ్మకం తో 3 శాఖలు అప్పగించారు. స్వాతంత్య్రము వచ్చాక ఎన్నడూ లేని విదంగా కేంద్ర మంత్రివర్గం లో బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించారు. ప్రజలకు దగ్గర అయ్యేందుకే ఈ జన ఆశీర్వాద యాత్ర చేపట్టాను. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలి. ఇంకా 200 దేశాలను కరోనా వ్యాధి పట్టి పీడిస్తుంది. గతంలో ఇతర దేశాల నుండి మందులు దిగుమతి చేయూకునేవాళ్ళం… ఇప్పుడు మనమే ఇతర దేశాలకు మందులను ఎగుమతి చేసే స్థాయికి వచ్చాము. ప్రపంచంలో ఉన్న 4 కరోనా టీకాలలో 2 మన దేశం నుండే ఉత్పత్తి చేసినవే . ఎన్ని లక్షల కోట్లు ఖర్చు ఐన దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తాము అని తెలిపారు.
ఇక కళాసంపదకు నిలయం ఓరుగల్లు జిల్లా…ఇక్కడి కళాసంపద ను రక్షించాల్సిన అవసరం వుంది. ప్రధాని మోదీ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది. వరంగల్ కు ఎయిర్ పోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఈటల రాజేందర్ ను ఓడించడానికి కేసీఆర్..కేసీఆర్ కుటుంబం కుట్రలు చేస్తుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ గెలుపు ఈటెల రాజేందర్ దే. హుజురాబాద్ లో రెపరేపలాడేది కాషాయ జండా నే అన్నారు. కేసీఆర్ అహంకారం దిగే వరకు హుజురాబాద్ ప్రజలు నిద్రపోరు. తెలంగాణ లో కాషాయ జండా ఎగురేసి తీరుతాము అని పేర్కొన్నారు.