తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ వన్‌లో నిలిచింది. 52 మంది 500 కు పైగా మార్క్ లు సాధించారు.
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు.
Group1 Results: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-1 ఫలితాలు ఈ రోజు (సోమవారం) విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తరువాత ఇవే మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 563 పోస్టులకు గానూ, 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. 563…
తెలంగాణలోని మహిళా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 13 వేలకు పైగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్-కస్టమర్ సపోర్ట్ సేల్స్) పోస్టుల కోసం రిక్రూట్ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి దరఖాస్తుకు చివరి తేదీ ఈరోజే..
Duddilla Sridhar Babu : ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత అగ్నిమాపక శాఖలో డ్రైవర్ అపరేటర్‌లకు మొట్టమొదటి బ్యాచ్‌కు నేడు పాసింగ్ అవుట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విపత్తు స్పందన , అగ్ని మాపక శాఖలో చేరబోతున్న 196 డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు. నాలుగు నెలల పాటు మీ ట్రైనింగ్ ఎలా ఉందో వివరించారని, డ్రైవర్ ఆపరేటర్ల అందరి…
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీలో 137 నాన్ టీచింగ్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరిగింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 11, సీనియర్ అసిస్టెంట్ 46, అసిస్టెంట్ 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి.
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్‌లో భారతీయ విద్యా భవన్‌లో జరిగిన రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా…
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తన పాత రిక్రూట్‌మెంట్‌లలో ఒకదాన్ని పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ యొక్క 14298 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మార్చి-ఏప్రిల్ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది.