పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఇవాళ కూకట్‌పల్లి, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై కీలక సూచనలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో టీఆర్ఎస్ బలంగా ఉందని తెలిపారు.. పార్టీ ఉంటేనే పదవులు ఉంటాయి.. ఆ పార్టీ కోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.. ఇక, రాష్ట్ర ప్రజలకు, పార్టీ అధినేత,…
ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అవసరం అయితే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. తెలంగాణ భవన్‌లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. మేం ప్రభుత్వoలో ఉన్నాం.. చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. కానీ, ప్రతిపక్షాలకు పని లేదు.. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు.. ఒకరేమో నేనున్నాని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జన సంఘ్ ఉందా..? అని ప్రశ్నించారు కేటీఆర్.. చరిత్రకు మతం…
పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ కమిటీల విషయంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇంఛార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల…
టీఆర్ఎస్ నేతలు మరియు కార్యకర్తలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దిశా నిర్ధేశం చేసారు .ఇటు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందని ప్రకటించారు కేటిఆర్ .గ్రేటర్ ఎన్నికల సమయంలో కో అపన్ష్ మెంబర్స్ గా అవకాశం ఇస్తామని హమీ ఇచ్చామని …అది కూడా జరిగేలా చూస్తామన్నారు.టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతూ…
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం ప్రకారం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్2 న 12,769 పంచాయితీలు, 142 మున్సిపాలిటీలలో కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.. సెప్టెంబర్ 12లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆయన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఏర్పాటు చేయాలని.. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు…