Jagadish Reddy: పూటకో మాట కోమటిరెడ్డి బ్రదర్స్ నైజం అని మంత్రి జగరదీశ్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. రాజ్ గోపాల్ రెడ్డి అమ్ముడుపోయిన వ్యవహారంను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నామని అన్నారు. 20వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నట్టు రాజ్ గోపాల్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు జగదీశ్ రెడ్డి. దొరికిపోయిన దొంగ రాజ గోపాల్ రెడ్డి అంటూ విమర్శించారు. రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగంగా అమ్ముడూపోయాడని తీవ్ర విమర్శలు చేశారు. 6 సీట్లు ఉన్న పార్టీని వదిలి, మూడు సీట్లు ఉన్న పార్టీలో చేరితే అభివృద్ధి ఎట్లా వస్తది అని ప్రజలు అడుగుతున్నారు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలో భాగంగా బీజేపీ మునుగోడు ఉపఎన్నిక తీసుకువచ్చిందని అన్నారు.
Read also: Madhya Pradesh: రైలులో మహిళను వేధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేసు నమోదు.
కాంగ్రెస్ లో ఉండి ఇన్ఫార్మర్ , కోవర్ట్ గా బీజేపీ కోసం పని చేశానని రాజ్ గోపాల్ చెబుతున్నారని అన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి పరువు నష్టం దావా వేయనియండి …ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ లో రాజ్ గోపాల్ కాంట్రాక్టుల మీద మాట్లాడారు అని అన్నారు. మునుగోడులో ఇప్పటి వరకు కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం ఉంది నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు.
Madhya Pradesh: రైలులో మహిళను వేధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేసు నమోదు.