బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విద్యార్థుల నిరసనగా విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు సైతం మద్దతుగా నిలిచాయి. అయితే.. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు బాసర వెళ్లే క్రమంలో అడుగడుగునా పోలీసు పహారా కాస్తుండ. ఎలాగైనా విద్యార్థులను కలవాలన్న పట్టుదలతో రకరకాల మార్గాలలో కారు, ట్రాక్టరు, కాలిబాటన వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డి అంతిమంగా క్యాంపస్ లోపలికి చేరుకున్న తర్వాత అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
To know the problems of the students of #IIITBasar & extend solidarity,
I tried to reach them.It’s blocked from all sides as if it’s
a jail.
8000 students protesting inside.
Not allowed to meet anyone,not even parents.I demand @TelanganaCMO to resolve the issue immediately. pic.twitter.com/cUATw2adAJ
— Revanth Reddy (@revanth_anumula) June 17, 2022