నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ(ట్రిపుల్ ఐటీ)లో చదువుతున్న విద్యార్థి అదృశ్యమయ్యాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన కత్తుల బన్నీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
నేడు ఆర్జీయూకేటీలో జరిగే 5వ స్నాతకోత్సవానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరవుతారని ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.వి. వెంకటరమణ అన్నారు. స్నాతకోత్సవ వేడుకల్లో 2013 నుండి 2016 వరకు సుమారు 576 మంది పూర్వ విద్యార్థులు సర్టిఫికేట్‌లను అందుకుంటారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విద్యార్థుల నిరసనగా విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు సైతం మద్దతుగా నిలిచాయి. అయితే.. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు బాసర వెళ్లే క్రమంలో అడుగడుగునా పోలీసు పహారా కాస్తుండ. ఎలాగైనా విద్యార్థులను కలవాలన్న పట్టుదలతో రకరకాల మార్గాలలో కారు, ట్రాక్టరు, కాలిబాటన…