తెలంగాణలోని కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) తీవ్ర ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకపోవడం కారణంగా ఈ ప్రాజెక్ట్ పనులను ఆపివేయాలని NGT స్పష్టంగా తెలిపింది.
పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది.
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో 900 కోట్ల రూపాయల జరిమానాను ఎన్జీటి విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
అక్రమ కంకరమిషన్ల పై సరైన చర్యలు తీసుకోలేదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై అసంతృప్తి వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT). నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కన్నెర్ర జేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత జరిమానా విధించారో చెప్పలేదని ఎన్టీసీ అసహనం వ్యక్తం చేసింది. చీఫ్ సెక్రటరీ నివేదిక సమగ్రంగా లేదని చెన్నై ఎన్జీటీ అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను ఆదేశించింది ఎన్జీటి. పిసటి…
ఫార్మా కంపెనీల కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది. దీనిపై ప్రభుత్వాన్ని నివేదిక కోరింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కే. రామకృష్ణ, ఎక్స్‌పర్ట్ మెంబర్ కే. సత్యగోపాల్‌తో కూడిన చెన్నై-ఎన్జీటీ బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది ట్రిబ్యునల్. ఫిర్యాదు చేసినప్పటికీ ఫార్మా…
విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై…
అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (NGT) తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి నిపుణులతో కమిటీ వేయాలని ప్రతిపాదించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టొద్దని సూచించింది. Also Read: ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే జగన్ నాశనం చేస్తున్నాడు: నిమ్మల రామనాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం పై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయాలని, ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని…