రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వల్లనే నలుగురు మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు పాతవి కావడంతో ఈ తరహా చిక్కులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో 19 మంది మహిళలు, మరో పది మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా వుంది. అయితే.. మృతి చెందిన మృతుల పోస్టుమార్గం నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఇబ్రహీంపట్నం ఘటనను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకొని పనిచేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ ఆదేశించారు. అంతేకాకుండా.. హెల్త్ మినిస్టర్ హరీష్ రావును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది మామ అల్లుళ్ళు మహిళా హంతకులు అంటూ టీపీసీసీ చీఫ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక చనిపోయిన మహిళా కుటుంబాలను హరీష్‌రావు పరామర్శించాలని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. నిందితులను తూతూ మంత్రంగా అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవద్దని.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వీరిపై నేషనల్ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
300 Years Old Idols Recovered: అరుదైన దేవతా విగ్రహాలు స్వాధీనం.. విలువ కోట్లలోనే