చిరంజీవిని తిడితే.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు!
సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగించటం శుభపరిణామం అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రజల గొంతు నులుమే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని.. లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పులు చేయటంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో కూటమి నేతలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప.. మరేమీ కనపడటం లేదని మండిపడ్డారు. ప్రజల మేలు కోసం అసెంబ్లీలో ఎలాంటి చర్చా జరగటం లేదని జోగి రమేష్ పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజల గొంతు నులుముతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. చేతగాని, చవట, సన్నాసి ప్రభుత్వం చంద్రబాబుది. 16 నెలల తన పాలనపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడతారనుకున్నాం కానీ మోసం చేసినప్పుడు దొరక్కుండా లీగల్‌గా, టెక్నికల్‌గా ఎలా తప్పించుకోవాలో వివరించారు. తన దగ్గర ఉన్న ఈ విద్యని కూటమి సభ్యులకు వివరించారు. స్కిల్ స్కాంలో దోపిడీ చేసి అరెస్టు అయి బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఓటుకు నోటుకు కేసులో రికార్డులతో సహా దొరికిన దొంగ చంద్రబాబు. కానీ లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అచ్చెనాయుడు ఈఎస్ఐ స్కాంలో దొరికితే ఆయన్ను అరెస్టు చేయటం తప్పా?. చింతమనేని ప్రభాకర్ జనాన్ని పీడిస్తుంటే అరెస్టు చేస్తే తప్పా?. అంగళ్లు ఘర్షణకు చంద్రబాబే కారణం. పోలీసులు పర్మిషన్ ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే దారిలో వెళ్ళి ఘర్షణకు దిగారు. ఒక కానిస్టేబుల్ కళ్లు పోవటానికి కారణమయ్యాడు. ఇవన్నీ వదిలేసి అసెంబ్లీలో ఇంకా జగన్ గారిని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. రైతులకు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్టు చేస్తారా?’ అని జోగి రమేష్ ప్రశ్నించారు.
పాక్ అహాన్ని, అమెరికా గర్వాన్ని బద్ధలు కొట్టిన ఫైటర్ జెట్..
అది 1971, డిసెంబర్ 4వ తేదీ రాత్రి జామ్‌నగర్ ఆకాశంలో భారతదేశం.. పాకిస్థాన్ అహాన్ని, అమెరికా గర్వాన్ని బద్దలు కొట్టిన రోజు. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. అమెరికా 1962లో పాకిస్థాన్‌కు F-104 స్టార్ ఫైటర్లను బహుమతిగా ఇచ్చి భారతదేశం అభ్యర్థనను తిరస్కరించింది. అగ్రరాజ్యం భారతదేశానికి చేసిన గాయాన్ని తొమ్మిదేళ్ల తర్వాత మిగ్-21 క్షిపణి నయం చేసింది. జామ్‌నగర్ ఆకాశంలో ఈ రోజు భారత్ తొలిసారిగా మిగ్-21 క్షిపణి ప్రయోగించింది. ఇక అప్పుడు మొదలైంది భారత్ నూతన చరిత్ర. ఈ విజయం భారత్‌కు ఎనలేని శక్తిని ఇచ్చినట్లు అయ్యింది. 1962 లో అమెరికా పాకిస్థాన్‌కు F-104 స్టార్‌ఫైటర్ వంటి హైటెక్ ఫైటర్ జెట్‌లను బహుమతిగా ఇచ్చింది. ఈ జెట్‌లను కొనుగోలు చేయాలనే కోరికను అగ్రారాజ్యం ముందు భారతదేశం వ్యక్తం చేసింది. కానీ అమెరికా దానిని పూర్తిగా తిరస్కరించింది. దీంతో భారతదేశం సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) వైపు తిరిగి మిగ్-21ను తన వైమానిక దళంలోకి చేర్చుకుంది. ఈ మిగ్-21 ఆ కాలంలో సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్. అది తరువాత కాలంలో చరిత్రకు తార్కాగణంగా నిలిచి సరి కొత్త చరిత్రను సృష్టించింది.
ఆర్జేడీకి భారీ షాక్.. లాలూ కుమారుడి కొత్త పార్టీ..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చీఫ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ ‘‘జనశక్తి జనతాదళ్’’ను ఆవిష్కరించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ పోస్టర్‌పై మహత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, రారామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్ వంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. దానిపై “సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, మార్పు ” అనే నినాదాలు ఉన్నాయి. పార్టీని ప్రకటించిన తర్వాత, తేజ్ ప్రతాప్ యాదవ్ సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేశారు. తాము బీహార్ పూర్తి అభివృద్ధి కోసం, కొత్త వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బీహార్ అభివృద్ధి కోసం సుదీర్ఘ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాను ఎన్నికల్లో వైశాలి జిల్లా మహువా స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.. వ్యయం తగ్గించడమే లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే.. ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లు అని, జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41 శాతం మేర వాటా కలిగి ఉందన్నారు. లాజిస్టిక్స్‌కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే.. ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై సీఎం అసెంబ్లీలో మాట్లాడారు.
ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా మంచి హిట్ అందుకుంది. కల్ట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేలా తీశాడు సుజీత్. పవన్ ను ఎలా చూడాలని ఇన్నేళ్లు ఫ్యాన్స్ వెయిట్ చేశారో.. అచ్చం అలాగే చూపించాడు. అయితే ఓజీ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో అకీరా నందన్ నటిస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ టైమ్ లో మరో విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే పవన్ కు చాలా కాలం తర్వాత హిట్ ఇచ్చినందుకు సుజీత్ పై పవన్ చాలా ఇంప్రెస్ గా ఉన్నారంట. అతనికి మరో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారంట.
కేసీఆర్ పట్టుబట్టి మొదటి దశమెట్రో పూర్తి చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణపై ఇటీవల తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని బాధ్యత రాహిత్యంగా అని విమర్శించారు. నిన్న మీడియా సమావేశంలో కేటీఆర్ మెట్రో ప్రాజెక్టుల పూర్వ చరిత్రను వివరించారు. కేటీఆర్ వివరాల ప్రకారం, మొదట ప్రైవేటు సంస్థ మెటాస్తో ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఆ సంస్థ వెళ్ళిపోయాక, ఎల్ అండ్ టి ప్రాజెక్ట్ కొనసాగించింది. 2014లో టీఎస్ ఆర్కోలో ప్రభుత్వం బాధ్యతల స్వీకరిస్తున్నప్పుడు మెట్రో పనులలో కేవలం 20 శాతం మాత్రమే పూర్తి అయ్యి ఉండేదని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ పట్టుదలతో 2017 వరకు మొదటి దశ పూర్తి చేసి, 69 కిలోమీటర్ల మెట్రోను దేశంలో రెండో అతిపెద్ద మెట్రోగా రూపొందించామని తెలిపారు.
బాలకృష్ణ మామూలుగా ఉన్నాడా?.. ఆ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నాం!
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నాం అని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఒక్క కార్యక్రమంలో భాగమయ్యాడా? అని అడిగారు. ఒక మాజీ సీఎం వైఎస్ జగన్, చిత్ర పరిశ్రమలో ముఖ్య హీరో చిరంజీవిని అవమానించడం సరికాదని మండిపడ్డారు. మండలి చైర్‌లో ఒక దళితుడు కూర్చున్నాడని అవమానించాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు కాపాడాలని, కానీ చట్టసభల్లో ఇలా జరగటం దురదృష్టకరం అని మండలి విపక్షనేత బొత్స పేర్కొన్నారు.
9 రోజుల బతుకమ్మ పండుగ.. ఇక్కడ మాత్రం 7 రోజులే.. !
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలు మాత్రమే పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ అచ్చమైన ఆడబిడ్డల పండుగ. అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీరోక్క బతుకమ్మలను తయారు చేసి రకరకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఆడబిడ్డలందరూ మెట్టినింటి నుంచి పుట్టింటికి వచ్చి సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఇందతా ఓకే కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే 9 రోజుల బతుకమ్మ పండుగ ఒక చోటు 7 రోజులు మాత్రమే నిర్వహిస్తారని మీకు తెలుసా? ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారు..
గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్.. ఐటీ హబ్‌గా విశాఖ!
త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో ఇంకా 50 వేల గదులు రావాలన్నారు. దసరా ఉత్సవాల్లో కోల్‌కతా, మైసూర్ సరసన విజయవాడను చేర్చాం అని సీఎం చంద్రబాబు వివరించారు.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ఇది గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీల సమాన ప్రాతినిధ్యాన్ని లక్ష్యంగా పెట్టి తీసుకున్న కీలక నిర్ణయం. ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నిర్ణయం సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే ఆధారంగా తీసుకున్నది. బీసీల వెనుకబాటుతనంపై కమిషన్ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకొని, సమాన అభివృద్ధి, సమగ్ర వృద్ధి, సమాన అవకాశాలను అందించే విధంగా రిజర్వేషన్ విధానం రూపొందించబడింది. ఈ జీవో డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్, ఆర్టికల్స్ 40, 243D, 243T ప్రకారం తీసుకోబడింది. అలాగే, “ది తెలంగాణా బీసీ రిజర్వేషన్స్ బిల్, 2025” కూడా ఈ విధానానికి మద్దతుగా ఆమోదం పొందింది. జూలై 11న ప్రభుత్వం విడుదల చేసిన అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, ఆగస్టు 28న సమర్పించబడిన కమిషన్ నివేదిక ఆధారంగా, బీసీలకు స్థానిక సంస్థల్లో సమాజిక న్యాయం , రాజకీయ సాధికారతను కల్పించే విధంగా రిజర్వేషన్లు అమలు చేయబడుతున్నాయి. తెలంగాణ ఈ నిర్ణయంతో పల్లె–పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా మారింది.