ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. కలవరపెడుతున్న వరుస ఘటనలు
దేశ వ్యాప్తంగా వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొఫెసర్ వేధింపులు కారణంగా ఒడిశాలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఆయా రాష్ట్రాల్లో అధ్యాపకుల వేధింపులు కారణంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటలు రోజురోజుకు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఐఐటీ-బాంబేలో 22 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి… ఢిల్లీకి చెందిన రోహిత్ సిన్హాగా గుర్తించారు. ఐఐటీ-బాంబేలో సైన్స్ విభాగంలో చదువుతున్నాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
రాబోయే ఎన్నికల్లో మోడీని, బీజేపీని ఓడిస్తాం..
కాంగ్రెస్ న్యాయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పోరాటం చేసింది.. బ్రిటిష్ వాళ్లపై కాంగ్రెస్ పోరాడింది.. దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని ఇచ్చింది.. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ ప్రజల్లోనే ఉంది.. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంది.. మోడీ పీఎం అయ్యాక సామాజిక న్యాయంపై ఆలోచన చేయడం లేదని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం.. పాకిస్తాన్ విషయంలో ఇందిరా గాంధీ వార్ చేసి.. ఖాళీ మాతగా నిలిచారు.. మహాత్మగాంధీ త్యాగం చేసి దేశాన్ని కాపాడారు.. ఇందిరా, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను అర్పించారు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
డ్యామ్ దగ్గర ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన వాహనాలు, యంత్రాలు
హిమాచల్‌ప్రదేశ్‌ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరుసగా ఈ మధ్య రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. తాజాగా కులు జిల్లాలోని మలానా-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో కాఫర్‌డ్యామ్ దగ్గర ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో వాహనాలు, భారీ యంత్రాలు కొట్టుకుపోయాయి. హైడ్రా క్రేన్, డంపర్ ట్రక్, రాక్ బ్రేకర్, కారు కొట్టుకుపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నిరంతర వర్షాలు, ఆకస్మిక వరదలు కారణంగా పార్వతి నది నీటి మట్టం పెరిగి ఈ ప్రవాహం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అంతకుముందు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని పండో ఆనకట్ట సమీపంలో చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైవేలో 50 మీటర్లకు పైగా కుంగిపోయింది. నిరంతర వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఉంటాయని భావిస్తున్నారు. చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిలో పండోహ్ ఆనకట్ట, మండి-కులు మార్గంలోని బాగ్లముఖి రోప్‌వే మధ్య ఒక భాగం కూలిపోయింది.
హిందువులను టెర్రరిస్టులుగా యూపీఏ ప్రభుత్వం చూపించింది..
మెదక్ లోని రామాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో హిందూ సంఘాలు, అఖిలపక్ష నాయకులు రామాలయం వద్దకు భారీగా వచ్చారు. దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకునేందుకు అధికారుల ప్రయత్నం చేశారు. అధికారులను అఖిలపక్ష నాయకులు, హిందుసంఘాలు అడ్డుకున్నాయి. దీంతో అధికారులు, పోలీసులు అఖిలపక్ష నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇక, ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకోవద్దంటూ ఆందోళన చేశారు. ఇక, మెదక్ లో వివాదానికి కారణమైన రామాలయాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రామలయాన్ని ఎండోమెంట్ లోకి ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. తెలంగాణలో ధూప దీప నైవేథ్యాలకు నోచుకోని ఎన్నో గుళ్లు ఉన్నాయి.. వాటిని తమ అధీనంలోకి తీసుకుని బాగు చేయాలని కోరారు. గతంలో హిందువులను టెర్రరిస్టులుగా అప్పట్లో యూపీఏ సర్కార్ చూపించింది అని ఆరోపించారు. పాకిస్థాన్ ఏజెంట్ లుగా యూపీఏ నేతలు మారారు.. హిందువుల్లో ఐక్యత తక్కువగా ఉంటుందనే అధికారంలో ఉండే పార్టీలు ఇలా చేస్తున్నాయని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ సైనికులు తమ ప్రాణాలకు తెగించి పని చేస్తారు అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
కుక్క చావు చచ్చారు.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం..
శుక్రవారం జమ్మూ కాశ్మీర్ కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ ‘‘ఆపరేషన్ అఖల్’’లో భాగంగా జరిగింది. దేవ్‌సర్ ప్రాంతంలోని అఖల్ అడవిలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఉమ్మడి ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నారని మరియు ఇటీవలి పహల్గామ్ దాడితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల్లో లష్కరే కీలక ఉగ్రవాది పుల్వామా నివాసి హరిస్ నజీర్ ఉన్నాడు. ఇతడిని భద్రతా బలగాలు ‘‘కేటగిరీ-సీ’’ ఉగ్రవాదిగా గుర్తించింది.
భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. “అపరిచితుడి” రూపంలో బిగ్ ట్విస్ట్..
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను చంపేందుకు తన సోదరులతో కలిసి ప్లాన్ చేసింది. దాదాపుగా మరణం అంచులో ఉన్న సదరు వ్యక్తి ఓ అపరిచిత వ్యక్తి మూలంగా రక్షించబడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. డాక్టర్ సహాయకుడిగా పనిచేస్తున్న రాజీవ్ అనే వ్యక్తి కాళ్లు, చేతులు విరిగిపోయి, తీవ్రమైన బాధతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. రాజీవ్ భారత్య సాధన, తన ఐదుగురు సోదరులు భగవాన్ దాస్, ప్రేమ్‌రాజ్, హరీష్, లక్ష్మణ్‌తో సహా తన ఐదుగురు సోదరులను హత్య చేయడానికి ఒప్పించింది. దీని కోసం వారు హంతకులను కూడా నియమించుకున్నారు. జూలై 21 రాత్రి, మొత్తం 11 మంది రాజీవ్‌ను అతని ఇంట్లో దాడి చేశారు. వారు అతని చేయి మరియు రెండు కాళ్ళు విరిచారు. అతన్ని సజీవంగా పాతిపెట్టాలనేది వారి ప్లాన్. దీని కోసం అతడిని సీబీ గంజ్ ప్రాంతంలోని అడవిలోకి తీసుకెళ్లి, పాతిపెట్టడానికి గోయ్యిని కూడా సిద్ధం చేశారు.
“బ్రహ్మోస్ క్షిపణి” శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రపట్టదు..
ప్రధాని నరేంద్రమోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తీరును కొనియాడారు. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై మే 7న భారత్ తీవ్రదాడి చేసింది. ఈ దాడిలో స్వదేశీ ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని మోడీ శనివారం అన్నారు. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లు ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారతదేశం) బలాన్ని నిరూపించాయని ప్రధాని మోదీ చెప్పారు.
హత్నూరలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ బాహాబాహీ..
సంగారెడ్డి జిల్లా హత్నూరులో శుక్రవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్-బీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జరగడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. “ప్రభుత్వ పథకాల పంపిణీ వేదికను రాజకీయ ప్రచార వేదికగా మార్చడం సమంజసం కాదు. ఇది అధికారిక కార్యక్రమమా, లేక పార్టీ కార్యక్రమమా?” అని ప్రశ్నించారు.
ఇక్కడ ఉంది సీబీఎన్.. వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం!
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని.. ఇంతకీ అతను పశువువా, మనిషా అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానైతే మరోసారి అలాంటివి జరగకుండా చూడాలని మందలించేవాడినని, కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శించాడని సీఎం మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్న నివాసంపై దాడి చేశారు. తాజాగా ప్రసన్నను జగన్ పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఫైర్ అయ్యారు. అలానే వైఎస్ జగన్‌కు సీఎం వార్నింగ్ ఇచ్చారు. లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉంది సీబీఎన్ అని పేర్కొన్నారు.
అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు..
గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యాచారం కేసులో కోర్టు అతడికి ‘‘జీవితఖైదు’’ విధించింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆయన ఇంట్లో పనిచేసే మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనను బెంగళూర్ కోర్టు దోషిగా తేల్చింది. అత్యాచారం సమయంలో రికార్డ్ చేసిన వీడియోతో తనను బెదిరించినట్లు మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజ్వల్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలైన మహిళకు రూ. 7 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్ణ గత లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మాజీ ప్రధాని హెడ్‌డీ దేవెగౌడకు ప్రజ్వల్ మనవడు. 48 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపుల వీడియోను ప్రసారం చేశాడని కూడా ఇతడిపై అభియోగాలు ఉన్నాయి.